పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారివివాహములు.

బలాత్కారముగాగాని ప్రచ్చన్నముగాగాని సంభోగించుట యభ్యాసమై యుండెను. ఈ ప్రకారముగా సంభోగింపబడిన స్త్రీ అట్టిపురుషుని భార్వకావలసి వచ్చుచుండెను. స్త్రీల పాతివ్రత్యమును కాపాడుటకై, ఈపద్ధతిని ఆర్యులుకూడ అరుదుగా అవలంబించి యుండిన నుండవచ్చును.

    పైన జెప్పియున్న వివాహములు ఆకాలమున ఆర్యులలోని వివిధజాతులయందును అనార్యులలోను పరస్పరాను కరణము వలన సహవాసకారణము చేత జరుగుచుండెననుట నిస్సంశయము. ఇట్టి సహవాసమున నుద్భవించిన యనేక నిర్భంధమువిధులు మనకు కానవచ్చుచునేయున్నవి. ఆగ్రేజాతులవారు క్రిందిజాతులవారి కూతుండ్లను పెండ్లియాడవచ్చును కాని క్రిందిజాతులవరు పైజాతుల స్త్రీలను పెండ్లిచేసికొనగూడదు. ఈనియమమునకు విరుద్ధముంగా జరిగిన వివాహమువలన జనించినసంతానము తుచ్చమైనదిగాతలపబడు చుండేను. తాము శూద్రస్త్రీలను వివాహమాడగూడదని బ్రాహ్మణులు విధించుకొనిరి. కాని మహాభారతమున పలుతావుల శూద్రస్త్రీని పెండ్లియాడినభ్రాహ్మణులు నిందింపబడి యున్నారు. వీరికి "వృషలీపతు" లని పేరు. ఇట్తిపురుషుడు దోషియనియు బ్రాహ్మణత్వమునకు దూరగుడనియు నరకగామియనియు చెప్పబది యున్నాడు. కాని వీనిసంగతి కెట్టిన్యూనతయు చెప్పబడి యుండలేదు. జయద్రధును జంపుదునని అర్జునుడు చేసిన శపధమున, తానట్లు చేయనిచో "వృషలీపతిపొందుదుర్గతిని పొందెదనని"  అతనివచనము కలదు.
  వెనుక మేము చెప్పిన ప్రకారము క్షాత్రయుగారంభము