పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రాయుగమునాటి హింద్వార్యులు.

వారు పొయినసంగతికి నేనుపొయెదగాక" యని యాతడనుచు న్నాడు. ++ తమరక్తము పరిశుబ్రమైనదని గర్వపడు శూరపురుషు లలో నిట్టిభావముండుటయబ్బురము కాదు.

   తాను వివాహము చేసికొను కన్యలు యుక్తవయస్కలై వివాహము నాడే నిషేకమునకు తగినవారుగా నుండవలయునని ఈ యుగారంభమున నుండిన యార్యులు కోరుచున్నట్టు కానవచ్చు చున్నది. ద్రౌపదీ వివాహము పంచపాండవులలొనొకనితొ నొక్కొక్కదినమున జరిగెననియు, అట్లయ్యదేవతాప్రభావమున ప్రతిదినము ఆమె కన్యగానే యుండెననియు మహాభారత మందున్నది. దీనినిబట్టి జూద వివాహవిధులలో నిషేకకారము ముఖ్యముగా నుండేననియు, వధువు నిషేకయోగ్యగా నుండుట యవసరముగానుండేననియు, తెలియవచ్చు చున్నది. వివాహ కాలమున ద్రౌపది వర్ణింపబడిన విధమునుబట్టి చూడ ఆమె తగినవ యస్సు కలదిగ నగపడుచున్నది. కుంతికి వివాహమునకు పూర్వమే పుత్రుడు జన్మించి యుండెను. వివాహమైన కొలది మాసములకే మరణించిన అఃభిమన్యుని భార్య ఉత్తర గర్బవతిగా నుండెను, అర్జునుడు సుభద్రనెత్తుకొని పోయినపుడు ఆమె నిండు జవ్వనము కలదై యుండెను. వేయేల? మహాభారతమున వచ్చిన స్త్రీలందరు నిట్టివారుగానే యున్నారు. మహాభారతమును బట్టి చూచిన, క్షాత్ర యుగారంభముననే కాక దానియంతమున గూడ ఫ్రౌడావివాహములు వాడుకయందుండినట్టు కానవచ్చు చున్నధి. రామాయణము కూడ దీనినే

++భుక్తపూర్వాంస్త్రియంయేచ నిందతామఘనంసిజాకి వ్రోణ॥