పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి వివాహములు.

ధనుడామెనాజ్ఞాపించును, ఇది పరిహాసముగా బలుక బడినవాక్యమే యైనుండవచ్చును. కాని ఉన్నతమగు నీతితత్వములనెరుగని స్త్రీలు ఒక భర్తనువదలి వేరొకభర్తనుపొందుట ఆకాలమున అసాధారణ విషయము కాదని దీనివలన దెలియుచున్నది. క్షాత్రయుగారంబమున వితంతూ ద్వాహముకాట ఎట్లుండినను, ఆయుగాంతమునమాత్ర మీయాచరము సంపూర్ణముగా నిషేధింప బడియుండెననుట నిస్సంశయము. $ ఆర్యస్త్రీలు పునర్వివాహము చేసికొనుటకు ప్రమాణములు రామాయణ భారతములందు లేవు. జర్మనులలో యొకతెగకు సంబంధించి వితంతువులు మరల వివాహము చేసికొనరని "టాసిటను" అనునతను వ్రాసియున్నాడు. దీనిని బట్టి చూచినచో ఆర్యజాతియందీనిషేధము అతిపురాతన కాలమునుండియే యుండేనని తోచుచున్నది. ఏలయన ప్రపంచములో మఱేజాతియందును ఇట్టి నిషేధముండినట్లు ప్రమాణము కానరాదు. "భక్తపూర్వ"లగు స్త్రీలను (అనగా క్షతయొనులను) వివాహము చేసికొనుటకు ఆర్యులు పాతకముగా నెంచుచుండిరి గనుక ఇట్టినిషేధము ఆర్యజాతియందు ఏర్పడేనని భావింప దగియున్నది. సైంధవుల్ని మఱునాటి సాయంత్రమువఱకు దెగ?టార్చెదనని అర్జునుడు చేసిన శపధమున ఇట్టివివాహము పాతకముగా దలపబడుచుండినట్లు తెలియుచున్నది. "భుక్తపూర్వ" లగ్ స్త్రీలను వివాహమాడిన


$ ఈవిషయమున దీర్ఘతముడు విధి నిర్ణయించెను.

ఏకవివపతిర్నార్యా యావజ్జీవపరాయణం।మృతేజీవివాతస్మి న్నాస ర్ంప్రభుయాన్నరిమ్॥ అది॥