పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

పాండవులయందు కానవచ్చుచున్నది. రెండవమరు మనదేశము నకు వచ్చి చల్లని ప్రదేశములలో నివసించిన యార్య్హులవెంట స్త్రీలు కొద్ది మందిమాత్రమే యుండుటవలన పరుపురుషులు ఒక స్త్రీనే భార్యగా గొనవలసివచ్చెను. మహాభారరమునందు బహుభర్తృత్వము నకు ద్రౌపదియొకతెయే యుదాహరనంగా గావవచ్చుచున్నది. అయినను పలువురొకవనితను పెండ్లియాడ వచ్చునా యను ప్రశ్న వచ్చినసందర్భమున యుధిష్టిరుడు "ఇది మా వంశాచారము" అని చెప్పియున్నాడు. ఈకారణమును బట్టి చూచినచో ఈయాచారము మొదటవచ్చిన యార్యులలో గాకపోయినను రెండవమారు వచ్చిన వారిలోక్షాత్రయుగారంభమ్న నుండెనని మన మొప్పుకొనవలసి యున్నది. ఇదికాకనియోగపద్ధతిని సంతానము బడయు నాచారము కూడ ఆకాలపు టార్యులలో నుండినట్టు కావచ్వచ్చుచున్నది. వీనినిబట్టి విచారించిన యెడలసంతానోత్పత్తి ఆదినములలో నత్యవసరము గానెంచబడుచుండెనని తోచుచున్నది.

   బహుభార్యాత్త్వంఊ, బహుభర్తృత్వము, నియోగం వీనితొబాటు వితంతూద్వాహములును సభర్తృకల పునర్వివాహములును ఆచరణయందుండవచ్చునని మనకుదోచుట సహజము. దమయంతికి ద్వితీయస్వయంవరము జరుగునని ప్రకటింపబడి యుండెను. కానియిదిజరుగలేదు ఈసందర్భమున నలుడు సాధారణ స్త్రీవలె విషయలౌల్యమునకు లోబడిదానవని దమయంతిని నిందించెను. ద్యూతమున ద్రౌపదియోడబడిన పిమ్మట, పాండవులను వదలిదృతరాష్ట్రసుతులలో నోకని జేపట్టుమని దుర్యో