పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి వివాహాములు.

ఖ్య కొంతయతియోక్తితో గూడినదేయైనను అతనిభార్యలసంఖ్య మాత్రము మితిమీరినదై యుండెదనుట నిశ్చయము. పరదేశీయు లలోపూరకాలమున "పార్క్యూల్సు" అనువాని కనేక మందిభార్య లుండినట్టును "సాలమను," అనునాతనికి వేయిమంది భార్యలుండి నట్లును తెలియుచున్నది. ఇవియన్నియు స్త్రీలు సాధారణములగు దోసిడివస్తువులుగా నెంచబడుచుందిన కాలపు ముచ్చటలు, ఆకాలమున ఒకదేశపురాజు వేఱొకదేసమును జయించునపుడు అచ్చట లభించిన దోపిడివస్తువులనెట్లో యట్లెయచ్చట దొరకిన స్త్రీలనుగూడ తెచ్చి తన మందిరములలో నునిచి తనవిషయాసక్తిని తృప్తిపఱచుకొనుటకు సాధనములుగా చేసికొనుచుండేను. ఆకాలమున మనదేశమునందు బ్రాహ్మణుడగు వాడును క్షత్రియుడును తమవర్ణములకు జెందిన స్రీలనేగాక, తమకు క్రింది వర్ణముల స్త్రీలనుగూడ పెండ్లి యాడవచ్చునను నియమముండెను. ఈనియమము భార్యలసంఖ్యను తగ్గించుటకు బదులుగా హెచ్చించు టకే తోడ్పడెను. దేశమునందలి విస్తీర్ణప్రాంతములు నిర్జనములుగా నుండి జనసంఖ్య తక్కువగానుండిన దినములలో భార్యలసంఖ్యను తగ్గించుట యనవసరముగా నైనను కాన్పింపలేదు. ఇకజనుల జీవితమందమా అదియును ఇప్పటికాల మంతకష్టముగా నుండలేదు. కనుక సంతానము కొఱకు వారెట్టి వివాహములనైను చేసికొనుచుండిరి.

 *బహుభార్యాత్త్వము ఆచారముగానుండిన క్షాత్రయుగాది యందే బహుభర్తృత్వముయొక్క  యుదాహరణముకూడ

  • దుర్యోధనునకు భీమునకు పలువురు భార్యలుండిరి. స్త్రీపర్వము.