పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రాయుగమునాటి హింద్వార్యులు.

దనిస్త్రీ భ్రూణహత్యా దోషము ననుభవించుననియు ఋషులు, విధించిరనియు, పాండురాజు కుంతిని నియేగపద్ధరిని సంతానము బడయ నాజ్ఞాపించు సందర్భమున నున్నది. పైవాక్యమున నుల్లేఖింపబడిన "పూర్వకాలము" క్షాత్రయుగముమునకంటే యెంతోపురాతనమై యుండవలయును. వీరకవ్యములకు సమకాలీనములగు నుపనిషత్తులలోగూడ నొకసందర్భమునకలదు. ఆసందర్భమున ఒకడు తనతల్లిని "నాతండ్రియెవరు!" అనియడుగ గా "నేనుయౌవనకాలమున పలువురితో సాంగత్యము చేసితిని కనుక నీతండ్రి ఫలానివాడని చెప్పజాలను" అని తల్లి ప్రత్యుత్తర మిచ్ఫెను. ఈకధయు, వివాహవిధి ఇంకను ఉనికి లోనికి రాక యున్న అతిపురాతనకాలపు విషయమై యుండవచ్చును. కుమారుని పేరు తల్లిపేరుతోగలిసిచెప్పు నాచారముకూడ అట్టికాలపు దేయైయుండవచ్చునని మాతలంపు.

      క్షాత్రాయుగారంభమున బహుభార్యాత్త్వము సామాన్యాచారమై యుండుట మనకు విస్పష్టముగా నగపడుచున్నది. దశరధునకు మూడువందల ఏబదిమందిభార్యలును, (దేవేరులు మాత్రము మువ్వురే), రావణుడు వేయిమంది భార్యలును ఉండిరి. ఇక ఈవిషయమున అందఱనుమించినవాడు మన శ్రీకృష్ణుడు. అతనికి పదునాఱువేల భార్యలుండిరని చెప్పుదురు. ఈసం ------------------------------------------------------

సమంఘోరం, భవిష్యత్యనుభావహం ॥అని॥ భార్యవిషయమున నక్రమముచేసిన పురుషునకు గూడ నిట్లె దోషము విధింపబడియున్నది కాని వానిని మనవారు పాటింపరు. భార్యాంసధావ్యుచ్చరిత, కౌమారబ్రహ్మచారినీం । పత్నివతామేతదేం, భవితాపాతకంభువికిఅని