పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు - వారి వివాహములు

                      ------
   క్షాత్రాయుగారంభము నాటినుండి తద్యుగాంతమునాటి వరకు హింద్వార్యులు యాహారమునందు వాటిల్లిన మార్పులను వెనుకటి వ్యాసమున జూసి యుంటిమి. సాంఘికకాచారములలో వివాహము చాలాప్రధానమైనది కనుక అప్పటివారి వివాహము లెట్లుండునో ఈ వ్యాసమున నాలోచింతము.
   హిందూదేశమునకు రాకపూర్వమే ఆర్యులు వివాహ విధిని పవిత్రకార్యముగా భావించుచుండిరని తెలియుచున్నది. అయినను వారిలో నొకకాలమున వివాహపద్దరి యుండనేలేదను సంగతి మహాభారమునందు కావవచ్చుచున్నది. పూర్వకాలమున స్త్రీలు ఒక పురుషుని వివాహముమాడనిర్భంధముందలేదనియు, వారి కీవిషయమున సంపూర్ణమగు స్వేచ్చయుండేననియు--ఏకంబీజో ద్భవ్లమను నభిమానము అభావమగుటవలన భ్రాతృభావము జనులయందు లేకపోవుటచేతను, ముదుసలులగు స్త్రీపురుషులనే మమారయువారు లేకపోవుటచేతను, తదితరకారణములవలనను, వివాహపద్దతి యవసరమయ్యెననియు-కనుకనే ఒకపతిని ++ పొం

++వ్యుచ్చరంత్యాతో పతింనార్యా, అన్యప్రభృతిపాతకం। భ్రూణహత్యా