పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి యాహారము.

యుండెడిది. అలసియుండినపుడును, సంతోషమున నుండినపుడు ను కృష్ణార్జునులు మద్యపానము చేయుచుండిరని మహాభరతము మనకు జెప్పుచున్నది. యదువృష్టులు మధ్యపానరతులని మన మెరుగుదుము. బలరాముని త్రాగుబోతుతనము మనకు క్రొత్తవిషయముకాదు. త్రాగుబోతుతనము యొక్క్ ప్రభావము వలన యాదవులంతకలహములపాలైతుదకు మడిసిన సంగతిమనకు తెలిసినదె. సురాపానము చేయువారు సురలనియు, చేయనివారు అసురులనియు రామాయణమునందు గంగాఖ్యానములోనున్నది. దండకారణ్యముంకుబోవుచు గంగానదిని దాటుంపుడు, తాన్ 14 సంవత్సరముల్ల వనవాసమును నిరపాయముగా గడపి మరల వచ్చువేళ అనెకకుంభముల్ మధ్యమును గంగాదేవి కర్పింతునని సీత మ్రొక్కుకొనినది. యుదిష్టిరిని యశ్వమేధ పర్ణమునందు యజ్ఞ ప్రవేశము మద్యసముద్రంగా నుండెనని యున్నది. పై యంశములును, లెక్కకు మిక్కిలిగానున్న ఇతరములగు నుదా హర్ణములును కల్సి, క్షాత్రయుగారంభమున్ మన హింద్వార్యులు సాధరణముగాను క్షత్రియులు ముఖ్యముగాను మద్యమును సేవించుచుండిరని మనకు రుజువుచేయుచున్నవి. కాని ఆ యుగము ముగియువఱకు హిందువులలో విశేషజనులు, ముఖ్యముగా బ్రాహ్మణులందఱును మద్యము వదలి యుండిరి. కాని క్షత్రియులుమాత్రం ఇంకను పూర్వాచార శృఖ్మలములను తపించు కొనజాలరైరి. మద్యపానము పంచమహాపాతకములలో నొకటియయ్యెను. ఈపాతకములు ఉపనిషత్తులలోగూడ వచ్చి