పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

భారతమున నిట్టి మాంసమునకు 'వృష్ఠమాంస ' మని పేరు. బరువులు మోయు జంతువులయెడల్ జనులకుగలకృతజ్ఞతవలన నీనియమము పుట్టియుండవచ్చును. ఈ కారణము వృషభము వధకు వర్తించునుగని గోవధకు వర్తింపదు. అంతేకాక గుఱ్ఱపుమాంస ము ఆకాలమున నిషిద్దముగా నుండలెదు. గుఱ్ఱముకూడ బరువులను మోసుకొనిపోవు జంతువేకదా. కనుక వృష్ణమాంస సిద్దాంతము తర్కమునకు నిలువజాలదు.

   గోమాంసముమాత్రమేకాక బ్రాహ్మణ క్షత్రియులుతినగూడని మాంక్షముల విధములు ఇంకనుగలవు. "ఐదునఖములు గల యైదుతరగతుల జంతువుల మాంసమునుమాత్రమే బ్రాహ్మణ *క్షత్రియులు తినదగినది". యని రామాయణమున నొక ప్రసిద్ధ శ్లోకము కలదు. దీనినిబట్టి చూచితిమేని బ్ర్రహ్మణులు మాంసాహారమును దిను విషయమున మఱే నిర్భంధముండినట్లు కానరాదు. ఇటుండియు, మహాభారతమున నొకచోట త్యాజ్యములగు జంతువులు పేర్కొనబడినవి. శాంతిపర్వములోని 36 వ అధ్యాయము "బ్రాహ్మణుడు తినగూడని మాంసమేది?" యని ధర్మరాజు భీష్మునదుగును. దీనికి భీష్ముడిచ్చిన ప్రత్యుత్తరమిది. +"ఎద్దులను, మంటిని (?) చిన్న పిపీలకలను,

  • పంచపంచనఖాభక్ష్యా బ్రహక్షత్రేణరాఘన, శల్యక శ్చానిధోగభా. ళళ కూర్మశ్పసంచమకి

+అనణ్వార్మృత్తికారైన, తధాక్షుద్రపిపీలికా॥,శ్లెష్మాతజస్తధానిప్రై, రభక్ష్యంవిషమేనచ।అభక్ష్యాబ్రహ్మణైర్మత్స్యాణ్ణ, శల్కైన్యేవిఅవిచర్జితా॥, శల్కైద్యేవైవిసర్జితా॥ । చతుష్పాత్కచ్చపాద న్యే మడూకాజలజాశ్చయే భాసా హింసా॥సువర్ణాశ్చ, చ్క్రనాకౌ॥ కాకోమద్గుశ్చ గృధర్చ,