పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

కాదు. ఆయజ్ఙసమయమున, జంతువులమాంసముతో వండబడిన వివిధ మధురాహారములకు మితమేలేకుండేననికూడ చప్పబడి యున్నది. +వేలకొలది బ్రాహ్మణులును లక్షలకొలది క్షత్రియులును భుజించుటకై యేర్పరుపబడిన విందులం దనేక పశువుల మాంసము వండబడియుండవలయుననియు, చంపబడిన జంతువులసంఖ్యనుబట్టియేమి, వాడబడిన ++మద్యభాండముల సంఖ్యనుబట్టియేమి అప్పటి మన హింద్వార్యులవిందులకును వరి సోదరులగు జర్మనీదేశీయుల విందులకును విశేషభేదముండలేదని యు చెప్పినచో నందు ఆసంగతిమేమియునుండరు.

  మహాభారతమున ఇప్పటియాకారము నొసగిన సౌతి, వైష్ణవ జైన బౌద్ధమతములు వృద్ధిజెందిన తరువాతివాడు; కనుక పైనజెప్పిన విందుల వివరములు అతనికి వింతగాదోచి యుండవచ్చును. కావుననే యాతడు, తరువాత వచ్చిన యధ్యాయమునందు అట్టి విందులను నిరసించినాడు. ఈయధ్యాయమున బంగారుతలగల యొక నకులము (ముంగిస) కధ వచ్చినది. మాంసాహారమును, జంతువలబలులును దూష్యములుగా జూపి, యవిగల యజ్ఞములకంటె ఆకలిగొన్న యతిధికి పిడికడటుకులు పెట్టిన నెక్కువపుణ్యము వచ్చునని నిరూపించుటకై

స్తభాజలచరాశ్చయే, సర్వాస్తానభ్యయంజన్తే, తత్రాగ్నిచయ కర్మణీకి అశ్వ:

+ భక్ష్యభాండవరాగాణాం శ్రియతాంభుజ్యతాంతధా, పశూనాంవధ్య తాంచైన నాంతందదృశరేజనాశ॥ అశ్వ॥

++సురామైరేయ్హసాగరం॥అశ్వ॥