పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారియాహారము

ముగా బరిణమించినదికాని లాభప్రదము కాలేదను సంగతిని మోక్షమూలరువంటివాడొప్పికొని యున్నాడు. పైన జెప్పబడిన మార్పెట్లు కలిగినదో వీరకావ్యములనుబట్టి యోచించుటకు ముందు, బృహదారణ్యకోపనిషత్తునందలి యీక్రిందివాక్యము మాచదువరుల శ్రద్ధనాకర్షింపదగియున్నది. "విద్వస్తభలందజేయుడుగను, సర్వజనప్రీతికరముగ నుపన్యసించు వక్తగాను, వేదార్ధమును బోధింపగలవాడుగను, దీర్ఘాయువుగను నుండు పుత్రుని బడయగోరువాడు నేతితోను (గొడ్డుదైనను సరే గొఱ్ఱెదైననుసరే) మాంసముతోను వండబడిన యన్నమును దినవలయును." ఇట్టి యన్నమును దినుటవలన పైవచనముననున్న ఫలము లభించునా లభింపదాయను విషయమున మేము వాదముసల్ప బూనుకొనలేదు. కాని ఈవాక్యమునుబట్టి చూచినచో గొడ్దుమాంసమును దినువారు శారీరక బలమునందు మాత్రమేకాక మానసికబలమునందు గొప్పవారగుదురని ఆకాలపువారు నమ్మియుండిరనుట్ స్పష్టముగా మాత్రము తెలియుచున్నది. కనుక ఆకాలపువారికి మాంస మహారమైయుండెననియు, పైన జెప్పినమాంసము మేదస్సునకుగూడ బలము నిచ్చునదియని వారెంచుచుండిరనియు తేలుచున్నది.

    మహాభరతముకూడ పైయంశమునే బలఫరచుచున్నది. యుద్దానంతరము ధర్మజుడొనర్చిన యశ్వమేధసందర్భమున, యజ్ఞకార్యముకొఱకు మంచిదని వచించియున్నాడు. @అంతే

@తంతందేవం సముద్దిశ్య, పక్షిణ:ప్;అశపశ్చయే, ఋషభాశాస్త్రసరితా,