పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు - వారి యాహారము.

   మనపూర్వులగు హింద్వార్యులు క్షాత్రయుగమున నెట్టి వస్త్రముల ధరించుచుండిరో మా మొదటివ్య్లాసౌన జూసి యున్నాము. ఆకాలమున వారెట్టి యాహారమును భుజింపుచుండిరో, క్ష్తాత్రయుగారంభమునుండి దద్యుగారంతమువఱకు వారి యాహారమున నేట్టిమార్పులు కలిగెనో ఈవ్యాసమున దెలుపుట మాయుద్దేశము. ఇట్టిమార్పులను మనకు జూపు ముఖ్యగ్రంధములు  ఉపనిషత్తులు, వీరకావ్యములు, మనుస్మృతియునై యున్నవి. మనవారిలో వాటిల్లిన యీమార్పులు ఒకదృష్టికి అభివృద్ధిసూచకము లేయైనను వేఱొకదృష్టితో జూచినపక్షమున నవి మనవారి హీనదశకుగూద కారణములైనవని యనేక విద్వాంసు లభిప్రాయబడుచున్నారు. నైతికాధార్మికబుద్ధితో నాలోచించిన యెడల, మతసంబంధమగు నుద్దేశములప్రేరణచేత మాంసాహరమును త్యజించి శాకాహరము నవలంభించిన వారు మ్న కెంతయు వందనీయులనుటకు సందేహముండునా? ఉండదు. కాని ఆరమార్ధికదృష్టితో నాహారమునందు వారుచేసికొనిన యామార్పు వారిని రాజ్యాంగస్వాతంత్ర్యమునుండి దూరగుల జేసిన మాటదలంచినపుడు యామార్పు వారికనర్ధదాయక