పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారియుడుపులు

కొలది గ్రంధములలో తాపసులు ధరించు వల్కలాజనములు వచ్చినవి. కాని ఇట్టివస్త్రములు ఏగడ్డితో జేయబడుచుండేనో ఎట్లు జెయబడుచుండెనో కానరాదు. ఇప్పటి కాలమున మాత్రము మనదేశమున కేవలము గడ్డితో చేయబడువస్త్రములు ఎచ్చటను కానబడవు. అయినను ఒకప్పుడు మనదేశమునందు గడ్దితో జేయబడు వస్త్రములుండెననుసంగగిమాత్రము నిజము. "ఈ హిందువులు గడ్డితో చేయబడు బట్టలను గట్టుకొనెదరెఉ. వారు నద్లలో రెల్లును గొనితెచ్చి చీల్చి చపవలెనల్లి వస్త్రముగా ధరింతురు" అను హిరోకోటనుఇ వ్రాత పైయంశమును బలపఱచుచున్నది.

                      -----