పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ను. ప్రతివాడును తన తలగుడ్డను తానే చుట్టుకొనుచుండెను. రాజులు మాత్రము కిరీటముల ధరించుచుండిరి. దుర్యోధనుడు భీమునితోజేసిన తుది ద్వంద్వయుద్ధముసమయమున కిరీటము అతని తలపైనుండెను. భగ్నోతుడై నేలబడిన పిమ్మట నాతని తల పయిన నదియట్లేయుండెను. కావుననే భీముడు దాని కాలితో దన్న గలిగెను. ఆ కాలమున కిరీటము శిరమునకు గట్టిగా బిగింపబడు చుండెననియు బుధముల వదలించిననేకాని వీడి రాకుండనుండెనని వీడిరాకుండెననియు మనమూహింపవచ్చును.

    హిందువుల వస్త్రములు తఱచుగా దూదితో నేయబడుచుండె డివి. ఆ కాలమున హిందూదేశమున తప్ప మఱెచ్చటను ప్రత్తి పండుచుండునట్లు కానరాదు.. అట్లుకాదేని "హించువులు చెట్ల పై పండు ఉన్నితో జెయబడిన వస్త్రముల్ను ధరింతురు" అని గ్రీకులు వ్రాసియుండరు. ధనవంతులు అందు ముఖ్యముగా స్త్రీలు పట్టు బట్టలు ధరించుచుండిరి. X రాజాంత: పురములలోని స్త్రీలు "సీతకాశే య వాసిరునులు" గా వర్ణీంపబడి యున్నారు. పురుషులుకూడ పసుపుపచ్చనబట్టలు ధరించుచుండినట్లు కానవచ్చుచున్నది. మన దేశములోని కాశ్మీరము, పంజాబు, గాంధారములలో బహుశ: ఉన్ని బట్టలుకూడ వాడబడుచుండెడివి. భర

X సుభద్ర మొట్టమొదట వచ్చి గోపాలిక వేషమున ద్రౌపదితో గలసి కొన్నప్పుడు ఆమె ఎర్రని పట్టుపుట్టమును ధరించియుండెను. శ్లో॥ సుభద్రాంత్వరమాణాశ్చరక్త శాసేయవాసినిం పార్ధప్రస్తావయా మాసకృత్యూఅగోపాలకనవు: అదికి21కి12