పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయ్హుగమునాటి హింద్వార్యులు.

తలగుడ్డ యెర్రగానో లేక ఏదయిన మరియొక రంగుదిగానో యుండ వలెను. హిందువుల తలగుడ్డలు గ్రీకులకు విచిత్రముగ గాన్పించినట్లు తోచుచున్నది. కనుకనే'ఏరియను ' గ్రంధకారుడు 'ఇండికా ' యను గ్రంధమున నిత్లు వచించియున్నాడు. "హిందువులు దూదితో నేయబడిన యొకవస్త్రమును గట్టుకొనెదరు. అదిమోకాళ్ళకును చీలమండలకునను మధ్యభాగమున వఱకుండు ను. ఇదిగక వేఱోకవస్త్రమును పయినవేసికొందురు. దీనిలో కొంతభాగమును వారు భుజములపయిన గప్పికొని తక్కిన భాగమును తమ తలకు జుట్టుకొనెదరు. *'ఏరియను ' చెప్పినట్లు ఒకటేవస్త్రమును తలకు జుట్టుకొనుటకును శరీరమును గప్పికొను టకుగూడ్ వాడుకొనువారు బహుశ: బీదవారయి యుండవలెను. గొప్పవారి తలగుడ్డ ప్రత్యేకవస్త్రమై యుండవచ్చును. 'కటిన్ యనురూఫను ' అను గ్రంధకారుడు హిందూదేశమును హిందువులను వర్ణీంచుచు "వీరు తమశరీరమును పాదములవరకు మృదువైన సన్న సన్నని వస్త్రములతో నాచ్చాదించుకొనెదరు. పాదుకలు తొడిగెదరు. దూదితో జెయబడిన బట్టను తలకు జుట్టుకొందురు." X అనిచెప్పియున్నాడు అయినను అప్పటితలగుడ్డ ఇప్పటికాలమున మనదేశమందలి కొన్ని ప్రాంతములలోనున్నంత చిక్కులు కలదిగాను పొడుగుగాను ఉండలేదని తోచుచున్నది. దానిని జుట్టుకొనుపద్ధతి బహుశఇప్పుడు ఉత్తరహిందూస్థానములోని పేదవాండ్ర పద్ధతివంటిదై యుండఫచ్చు


  • Ancient India. Megasthanes and Arrian by Mac Crindle p.219

X Invasion of India by Alexander. Mac Crindle P.188