పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారియుడుపులు

అనునది. ఇది చతుర్ధరుని గ్రంధమునందలి పాఠము. అతడు దీనికి బదులుగా, ఏతాస్త్వీసీమంతశిరోరుహాయా!, అని యుండిననింత కంటె బాగుండూని వ్రాసియున్నాడు. పాపడను చూణన్ ముతో నలంకరిచుటకై వెంట్రుకలను రెండు పాయలుగా దీసి తలముడుచు టకు 'సీమంత 'మనిపేరు. ముత్తయిదువులగు స్త్రీలు మాత్రమే ఈ విధముగాతలలముడీచికొనుచుండిరికనుక వితంతువులనుయిట్టి యలంకరణము లేనివారినిగావణీన్ చుటసహజము. ఇంతేకాదు. "సర్వజనసంహారముజరగి పృధ్వియంతయు శోకమయమై ఉత్తమ స్త్రీల సీమంతము తీసివేయబడినప్పుడు..." అను నర్ధముగల శోకము X కూడ సీమంతము పొవుట వైధవ్యముయొక్క ముఖ్య లక్షణమని స్పష్టముగా జాటుచున్నది.

     మర్యాదగల పురుషులు వెండ్రుకలను ముడివేసికొనుచు బయటికి వచ్చినపుడు తలగుడ్డ పెట్టుకొనుచు నుండిరి. ఈ తల గుడ్దపద్ధతి హిందువులు స్వయముగా నేర్పఱచుకొనినదేకాని ఇతరులను జూచి నేర్చుకొనినదికాదని తొచుచున్నది. ఇప్పటి వలెనేఋ ఆకాలమునందును వరు ఢరించు తలగుడ్డ యొక పొడుగుపాటి వస్త్రము. దీనిని వారు తలచుట్టును వివిధములుగా జుట్టుకొనుచుండిరి. యుద్ధరంగమునకు బొవుసమయమున భీష్ముడు తెల్ల తలరుమాలును ధరించినట్లు చెప్పబడియున్నది. ద్రోణుని విషయమునంగూడ నట్టివర్ణనయేకలదు. కనుక వయసు మీరిన వారి శిరోవేష్టము సాధారణముగా తెల్లరంగుది గాన్ యోవనుల

X శ్లోకి సంహారేసర్వతోజాతే పృధిజ్యాం శోకసంబావె! బహూజా నుత్తమస్త్రీణాం సీయంతొద్దరగేతధా ॥శల్యకి21॥20