పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు

ర్చువేళసయితము వారుత్తరీయమును వేసికొనకుండిరి. వితంతువు లాకాలమున చెల్లని యుత్తరీయముల ధరించుచుండిరి. అరణ్యముననుందిన ధృతరాష్ట్రుని దర్శించుటకై అతని కుటుంబములోనివారగు వితంతువులు పాండవుల రాణివాస్దముతొ బోయినప్పుడు వారు తెల్లని యుత్తరీయములను ధరించి యుండిరని చెప్పబడియున్నది. Xదీనినిబట్టి యాలొచించగా, తెల్లని యత్తరీయము వితంతువులకొఱకు మాత్రము విధింపబడి యుండెననియు తదితర స్త్రీజనము ఎఱుపు నలుపు మొదలగు రంగుల యుత్తరీయములను వేసికొనుచుండి రనియు తేలుచున్నది. ఇప్పటీకాలమున వితంతువుల వస్త్రములు ఎఱ్ఱగానుండిన మంచిదని తలంచుచున్నారు. ఇది ప్రాయశ:భౌద్ధభిక్షునుల పద్ధతి ననుసరించి వచ్చిన యాచారమై యుండవచ్చును. వివాహితులగు స్త్రీలు కట్తుకొని బట్టలుకూడ వేఱువేఱు రంగులుకలవిగా నుండవచ్చును. కట్టికొనువస్త్రము లును ఉత్తరీయములును ఇప్పటికాలము వానివలె అంచులు కలవై యుండెనని తోచెడిది.

    ఇక శిరోవేష్టములను గురించి విచారింతము. ఆకాలమున స్త్రీలకు శిరోవేష్టము లుండినట్లు కానరాదు వారి తలలకు తోపీకాని మఱేదయిన నాచ్చాదనముగాని యుండలేదు. zవితంతువుల తెల్లనివస్త్రములనుగుఱించి వెనుక నుల్లేఖింప బ

డిన శ్లోకపు మొదటి చరణము 'ఏతాస్తుసీమంతశిరోరుహాయా '


X శుశ్లోత్తరీయాం నరరాజసత్న్యంకి ఆశ్రమకి 157 16. z బయటకు వెడలినప్పుడుమాత్రము వారుతలలపై నుత్తరీయమును గప్పికొనుచుండిరనుట నిశ్చయము.