పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంపాదకీయ భూమిక

కృషి ప్రచారిణీ గ్రంథమాల చందాదారులకు విన్నపము.

  మా చందాదారులు మాకుపరమహితులు. మేము గ్రంధమాల స్థాపించి మూడువర్షములైనను, యింతవరకొక్క కుసుమంకు మాత్రము ప్రచురించి మామిత్రులసహవాసము నఱచితిమి. అంతమాశతృపక్షమువారు కొందరుమమ్ములను స్థానిక పత్రికలమూలమున హెచ్చరించిరి. కొందరుమమ్ములను స్థానిక పత్రికలమూలమున హెచ్చరించిరి. కొందరు సమక్షముననే పరిశీలించిరి. వీనికన్నిటికిని ప్తర్యుత్తరములు వివరముగాతెలిపి యున్నాము. ఇందుమూలమున మాచందాదరులును, మిత్రవర్గములోని మరికొందరు  వెలమమహాశయులును, మాయార్ధిక లోపమును గ్రహించి మాకన్నివిధముల సహాయమొనర్చి, తిరిగి కార్యనిర్వహణం క్రియారూపముదాల్చుటకు తోడ్పడినందుల కెంతయు శ్లాఘించుచున్నాము.
    క్షాత్రకాలపు హింద్వార్యులు శ్రీయుత మాడపాటి హనుమంతరావు పంతులుగారు వ్యాసరూపమున గ్రంధాలయ సర్వస్వమునందు చిరకాలము క్రిందటనేవ్రాసిరి. మేము మాగ్రంధమాలకొక గ్రంధమువ్రాయుడని ప్రార్ధించినపుడు, శ్రీపంతులుగారు మావేడుకను నిరాకరింపజాలక, యీ గ్రంధము ప్రకటించునెడ జనోపయోగముగానుండునని సలహానిచ్చుచు తమగ్రంధ