పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రంథాలయ సర్వస్వ ప్రకటన మాగిపోవుటతో, నాకు నీ గ్రంథవిషయముల తెనిగించు నుత్సాహము ఆగిపోయెను. ఇందునకు నేనెంతయు చింతిల్లుచున్నాను.

రావుబహద్దరు వైద్యాగారు మన దేశచరిత్రములోని హిందుమహాయుగమున నిపుణులు. వారి వచనా విధానమును అద్వితీయమని నావిశ్వాసము. చారిత్రక వాజ్మయము చదువు వారందరికీ ఎక్కువయుత్సాహము గొలుపునది కాదు. అట్లయ్యు కీ. శే. కొమర్రాజు లక్ష్మణరావు ఎం. ఏ. గారివలెనే శ్రీవైద్యాగారును చరిత్రను మనోహరముగా నొనర్చుటయందు సమర్థులు. వీరు ఆంగ్లమున రచించిన గ్రంథములలో ముఖ్యములు "మహాభారత సమక్షణము" (Mahabharata a criticism) "రామాయణ సమస్య" (The riddle of Ramayana) "హిందూదేశ క్షాత్రయుగము" (Epic India) "హిందూమహాయుగము యొక్క మధ్యకాల చరిత్ర" (History of Medeaval Hindu India) అనునవి. ఇవు అన్నియు విజ్ఞానప్రదములును, మనోహరములును, పరిశౌధనా పూర్వకములును నగు గ్రంథములు. ఆంధ్రసోదరులు వీనిని పఠించినచో అనేక నవీనవిషయముల నెరుగగలరు. పైవానిలో "మహాభారత సమీక్షణము" అనుగ్రంథము నావలన తెనిగింపబడినది. దీనిలోని కొన్ని యధ్యాయములు "ఆంధ్రభారతి" (మచిలీపట్నము) ఆంధ్రాభ్యుదయము (హనుమకొండ) దేశబంధు (వడ్డెపల్లి) మాసపత్రికలలో ప్రకటితములైనవి. తక్కిన గ్రంథములను తెనుగు వ్రాయదలచితినిగాని, అవకాశము లభింపకపోయెను.