పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

ఈ పుస్తకములోని (5) వ్యాసములును, క్షాత్రయుగము (Epic age) నాటి యార్యుల జీవన విధానమును దెలుపుటకై వ్రాయబడినవి. ఇవి కొన్ని సంవత్సరములక్రింద బెజవాడయందు వెలువడుచుండిన "గ్రంథాలయ సర్వస్వము" అను త్రైమాసకపత్రికయందు అప్పుడప్పుడు ప్రకటింపబడుచు వచ్చినవి. ఆవ్యాసములనే ఇప్పుడు మాన్వితృలగు శ్రీయుత పువ్వాడ వేంకటప్పయ్యగారు (కృష్ణ ప్రచారిణీ గ్రంథమాల సంపాదకులు) నాయందు వారికిగల యభిమాన విశేషమున గ్రంథరూపమున వెలువరించుచున్నారు.

దీనిలోని వ్యాసములను రచించుటయందు స్వతంత్ర కల్పనము (originality) ఏమాత్రమును లేదు. బొంబాయివాస్తవ్యులును, మన్వితృలునునగు రావుబహద్దరు చింతామణిరావు వైద్యా, ఎం. ఏ. ఎల్. ఎల్. బి., గారు వ్రాసిన విఖ్యాతమగు "ఎపిక్ ఇండియా" (Epic India) అను ఆంగ్లగ్రంథములోని వ్యాసములకు నారచన కేవలము అనుకరణము. అంతే రావుబహద్దరు వైద్యాగారి గ్రంథమున క్షాత్రయుగము నాటి ఆర్యులనుగూర్చి తెల్పు వ్యాసములింకను ఎన్నియోకలవు. అవియు తెనుగున ప్రకటింపబడినచో, పేదయైయున్న ఆంధ్ర చారిత్రక వాజ్మయమునకు కొంత పుష్టికలుగుననుట నిశ్చయము.