పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి భూగోళస్త్రజ్ఞానము.

యు, మనచుట్టుప్రక్కలనున్న దేశములగురించియు బాగుగాదెలిసి యుండుననియు యెఫ్ఫుకొనకతప్పదు. హింమాలయము, కారకోర్ము, అల్టాయ్ అనుమూడు పర్వతపంక్తులును. తిబెత్, తుర్కిస్థానము, సైబీరియాల యందుండిన "గోబీ" మున్నగు నెడారులును, అనేకసరస్సులును వారికి దెలిసియుండెను. గ్రీకులను, వషికాయనులను, సిధియనులను, హూణులను, చైనీయులను, ఉత్తరప్రాంతములందు నివసించు అనాగరికజాతులను వారెఱింగియుండిరి. అలెగ్జాండరుని దండయాత్ర యైన పిమ్మట మనవారికి పైనబేర్కొనిన జాతులవారి పరిచయము కలిగెనని కొందఱువదింతురుకాని యదిసరికాదు. మహాభారము లోని యొకశ్లోకము *నందు ఉత్తరదిశయందలి మ్లేచ్చులు పేర్కొనబదియున్నారు. వారిలో హిందూదేశమున కుత్తర్మున నివసించుచుండినజాతులన్నియు చేరియున్నవి. క్షత్రయుగాంతము న అనగా అలగ్జాండరుదండయాత్రకు పిమ్మట ఈజాతులవారిని మనవారెఱుగుదురనుటయందు సంశయములేదు. కాని అంతకు పూర్వము కొన్నిశతాబ్దముల కాలమునుండియే మనవారు ఈజాతు లకు కృతపరిచయులేదనుటకు కారణములుకలవు. "డెరయను" అనుపారశీకదేశపురాజు సింధునదికి పశ్చిమముననున్న భూభాగమును తన సామ్రాజ్యమున గలిపికొని దానినొకసత్రపీ(Satrapy) గానేర్పఱచెను. కనుకపారసీక


  • యవనాశ్వనకాంభోజా, జారుణా మ్లేచ్చజాతయ: । సకృద్గృహా కులత్మాశ్చ, హూణా:పారసికైనసహ । తధైనరమణాశ్వినా॥, తధైనదశమాలికా:॥ --భీష్మపర్వము. అధ్యా:9