పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రాయుగమునాటి హింద్వార్యులు.

భూగోళవివరములు సరిగా తెలియవు. తెలసినభాగమంతయు నొక ఉత్తర హిందూస్థానము మాత్రమే. అట్లుండియు, అతడు సుగ్రీవుడు సీతాన్వేషణమునకై వానరులను నలుదెశలకంపుచుండిన కధగల సంధర్భములోల్ ప్రపంచభూగోళమును కేవలమూహపోహలతో నింఫి వర్ణించియున్నాడు ఈవర్ణనమునందు మేరువు ఉత్తరము నుంది యెగితి ప్రపంచముయొక్క దక్షిణదిశాంతమున వచ్చి నిలచినది రామాయణపు తుదికతన్ జోతిశ్శాస్త్రజ్ఞానము లేని వాడగుట చేతకాబోలు, మేరువు పశ్చిమముననుండనిచో సూర్యుడు మేరువుచుట్టు తిరుగుటెట్లు సంభవించునని సందేహపడి యామేరువును పశ్చిమదిశాంతమున స్థాపించెను!

     సూర్యుడు తూర్పుకొండలయందుదయించి పడమటి కొండలలో నస్తమించుననియు ఈ కొండలు రెండును ప్రపంచము నకు పూర్వపశ్చిమదిశలందు హద్దులనియు, వానికావలి ప్రదేశములు మనుష్యులు ప్రవేశించుటకు వీలులేనివనియు అస్తసమయమున సూర్యుడు మేరువువెనుకకుబోయి, పడమటికొందనుండి యుత్తరమునకుబోయి యుదయసమయము వరకు తూర్పుకొండవద్దకివచ్చుచుండుననియు మనవారి యూహ. మనమురొకరినె యననేల! భూమిపలకవలెనున్నదని నమ్ముచుండిన పూర్వకాలపువారందరికిని పశ్చిమము నకుబోయి యదృశ్యుడైన సూర్యుడు ఉదయము వఱకు తూర్పున కెట్లువచ్చుచున్నాడో యనునది మహదాశ్చర్య కరమగు సమస్యయైయుండెను!
 అప్పటికాలపు హింద్వార్యుల ప్రపంచభూగోళజ్ఞానము సరియైనదిగా నుండకపోయినను, వారికి మనదేశమునుగుఱించి