పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి భూగోళశాస్త్రజ్ఞానము.

వాస్తెవమేకాని ఈసామ్యము కాకతాళీయముగా సంభవించినదని తోచుచున్నది. ఈవర్షమునందే చేరియున్న రష్యాపైబేరియాలు ఇప్పటికాలమందంత సుఖప్రదమైనవి కాకపోయినను పురాతనకాల మున నిప్పటికంటె నెక్కువ వాసయోగ్యములుగా నుండి యుండ వచ్చును. ఇంతేకాక అని యార్యుల అతిపురతన నివాసస్థలము లైనకారణమున వారు ఆప్రదేశమును "పుణ్యభూమిగ నెంచుచుండి న్ నుండవచ్చును. మేరువున కుత్తరమున నున్న వని చెప్పబడి యున్న మూడు పర్వతముపంక్తులను మాత్రము మనవారెఱిగియే యుందిరనుట నిస్సంశయము. ఏలయనగా కైలాసపర్వతమున కుత్తరేముననున్న హరివర్షమునం దొక విశాలమైన ఇసుక యెడారి యు నొకసరోవరము ఉండినట్టు వర్ణింపబడియున్నది. మహప్రస్థానమునందు గూడ పాండవులు నుత్తరాభిముఖులై పొవు నపుడు ఒక్ యిసుక యెడారిని దాటిరని చెప్పబడియున్నది. ఈ యిసుకయెడారి యిప్పటి "గోబి" యెడారియేయనియుసరొవరము "అరల్ సముద్రము" (Sea of Aral) అనియుస్పష్టముగా దెలియుచునె యున్నది కదా.

    కొంతయదార్ధమును కొంతయూహాజనితమును నగుపైవర్ణనయే ఇంచుకమార్పులతో రామాయణమునందు వచ్చినది; కాని రామాయణమునందు ఊహకు నిరంకుశ ప్రభుత్వములభించినందున మఱింతగందరగోళము సంభవించినది రామాయణమును తుదిమారువ్రాసిన యాతనికి హిందూదేశపు