పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొప్పరపు సోదర కవులు

కొప్పరపు వేంకట సుబ్బరాయ శర్మ (12.11.1885 - 29.3.1932), కొప్పరపు వేంకట రమణ శర్మ (30.12.1887 - 21.3.1942), నివాస స్థలం - కొప్పరం గ్రామం, నరసరావు పేట తాలూకా, తల్లిదండ్రులు: సుబ్బమాంబ, వేంకట రాయుడు, బిరుదులు: బాల సరస్వతి, ఆశు కవీంద్ర సింహ, విజయ ఘంటికా, ఆశుకవి చక్రవర్తి, కుండినకవి హంస, కవిరత్న, అవధాని పంచానన, కధాశుకవీశ్వర, ఆశుకవి శిఖామణి. రచనలు: కనకాంగి(పద్య కావ్యము), పసుమర్తి వారి వంశావళి(1909), జ్ఞానోపదేశము, నారాయణాస్త్రము, సుబ్బరాయశతకము (1936), కృష్ణకరుణా ప్రభావము(పద్యకావ్యము), దైవ సంకల్పము (పద్యకావ్యము. 1913), దీక్షితస్తోత్రము (1916), శతావధానము(1911) మొదలుగా,

వీరిద్దరూ అన్నదమ్ములు, ఆశుకవితా చక్రవర్తులు. అసంఖ్యాకంగా అష్టావధానాలు చేశారు (1908) 'కవిత పుట్టిల్లు సోదర కవుల యిల్లు' అనే ఖ్యాతి పొందారు. వీరిది అసాధారణమైన ధారణ. అపూర్వమైన ధార. తిరుపతి వేంకట కవులతో సమ ఉజ్జీలుగా నిలిచి మెప్పు పొందారు. ఈ ఉభయ జంటల మధ్య చెలరేగిన సాహిత్య వివాదం పండిత లోకంలో గొప్ప సంచలనం సృష్టించింది. ఆంధ్రదేశంలోని ఉద్దండ పండితులైన వారందరికీ కొప్పరపు కవుల పక్షానో, తిరుపతి వేంకట కవుల పక్షానో నిలువక తప్పింది కాదు. వీరు లక్కవరం, గద్వాల, చల్లపల్లి వంటి సంస్థానాలలో 150 సభలలో అష్టావధాన, శతావధాన, ఆశుకవితా ప్రదర్శనలనిచ్చారు. వీరి మొదటి ఆశుకవిత్వ సభ ఆల్వాల లష్కరులో జరిగింది. ఈ సభలో ఆదిరాజు తిరుమల రావు గారు వీరికి ముంగాలి. బిరుదు అందెను బహుకరించారు. చెన్నపురి, బాపట్ల, విశదల, చీరాల, గుంటూరు, పంగిడిగూడెం, హైదరాబాదులలో చేసిన శతావధానాలు ప్రఖ్యాతమైనవి. కవి పండితుల సమక్షంలో ప్రతిభావంతంగా ఒక్కరోజులోనే అవధానం పూర్తి చేసి సభికుల ప్రశంసలు పొందటం, ఎక్కువ కాలవ్యవధి లేకుండా రెండు రోజుల వ్యవధానంతోనే శతావధానాలు చేయటం వీరి విశిష్టత. వీరు ప్రబంధ శైలిలో గంటకు 500 పద్యాలు చెప్పేవారు. మార్టేరు సభలో పందెం వేసి గంటకు 720 పద్యాల లెక్కన అరగంటలో 'మను చరిత్ర'ను ఆశువుగా చెప్పారని తెలుస్తున్నది. గద్వాల సభలో