పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
333

8. దక్షిణకాశిక - (1997)

శ్రీనాధ మహాకవి విరచిత శ్రీ భీమేశ్వర పురాణమునకు ప్రతిపదార్ధ భావవిశేష సహితమైన తొమ్మిదివందల పుటల విపుల వ్యాఖ్యాన గ్రంథము.

9. చతురాస్య - (1998)

సాహిత్య సభలలోని (సమస్యలు - దత్తపదులు - వర్ణనములు - ప్రత్యేక సమావేశములు) పద్యముల సమాహార గ్రంథము.

10. శ్రీనాథుడు - సందేహాల చర్చలు - (2000)

11. ఆధునిక యుగారంభములో సాహితీ కలహాలు - (2001)

12. కొప్పరపు సోదర కవులు - (2003)

ఆముద్రితములు

13. మహాకవి కాళిదాసు

కాళిదాసు నామము - కాలము - గ్రంథములు - ఉపమాలంకార వైవిధ్యము - వాల్మీకి అనుసరణములు - మొదలగు అనేకాంశముల వివరణములతో కూడిన సమాలోచన గ్రంధము,

14. సాహిత్య కాలక్షేపము

గ్రంథ పీఠికలు - ఆకాశవాణి ప్రసంగములు - ఉపన్యాస వ్యాసములు - వివిధ సమయాలలో చెప్పిన పద్యములు గల గ్రంథము.

15. తెలుగు సాహిత్యములో సందేహ ధోరణులు - సమన్వయ సరణులు

82 సందేహములు - వాని సమన్వయముల 1035 పుటల గ్రంథము. యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ మేజరు రీసెర్చి ప్రాజెక్టు పథక సహాయముతో వ్రాయబడినది.