పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

332


డాక్టర్ గుండవరపు లక్ష్మీనారాయణ, M.A.,Ph.D.,

రచనల సూచిక

ముద్రితములు

1. మణిహారము - (1968)

వివాహ సందర్భమున సంకలనము చేసిన సాహిత్య వ్యాసముల గ్రంథము.

2. తిరుపతి వేంకటీయము - (1973, 1975, 1997)

తిరుపతి వేంకటకవుల సాహిత్య జీవితము-ఎనిమిది అంకముల నాటకము-ఆంధ్ర విశ్వ విద్యాలయము బి.ఏ. తరగతికి (1975-78) పాఠ్యగ్రంథముగ నిర్ణయించిన గ్రంథము.

3. ఆదిభట్ట నారాయణదాసు - (1975)

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భమున ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక ఎకాడమి ప్రచురించిన గ్రంథము.

4. పంచముఖి - (1976, 1999)

వివిధ పత్రికలలో ప్రచురితములైన ఐదు సాహిత్య వ్యాసముల గ్రంథము.

5. నారాయణ దర్శనము - (1983, 2003)

ఆదిభట్ల నారాయణదాసుపై పరిశోధనము - ఆంధ్ర విశ్వవిద్యాలయము 1980లో పిహెచ్.డి. ఇచ్చిన సిద్ధాంత గ్రంథము.

6. వాల్మీకి రామాయణము - మహాకావ్యము - (1982)

వాల్మీకి మహర్షి వర్ణనా వైభవమునకు దిక్ప్రదర్శన గ్రంథము.

7. కళాకేళి - (1992)

తెలుగు సంస్కృతి ప్రతిబింబించు కళామయ కథాత్మక పద్య కావ్యము. ఈ కావ్యముపై తెలుగు విశ్వవిద్యాలయములో 24.01.2002న పి.వి రత్నాచారికి ఎమ్.ఫిల్. పట్టా లభించింది.