పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
331


శ్రీ వేంకటసుబ్బరాయ కవిగారి ఆస్తమయము

శ్రీ మిన్నికంటిగురునాథ శర్మగారు

యతులుంబ్రాసలువోయినన్ గణములున్వ్యత్యాసముంజెందినన్
మతియెట్లేగిన నట్లువోవుచుఁ బ్రధానంబైన వస్తుస్థితిన్
స్మృతియింతైనను లేక యాశు వెటులో యీడ్వం గవుల్లేరె యీ
క్షితి; నీరీతిని గారుగాకయని శోకించుంజుమీ వాణియున్

కచ్చెనే కాని నిక్కమునకు నీపాండి
         తికి రిచ్చవడకున్న ధీరుఁడెవఁడు?
వాదంబునకెకాని వాస్తవంబునకు నీ
         యాశువుంగని తృప్తినందఁడెవఁడు?
అరసికతంగాని యఖిలాంధ్ర విషయంబు
         నందు నిన్మెచ్చని యాతఁడెవఁడు?
చాటుననేకాని సమ్ముఖంబున నమ
         స్కారంబనని ధైర్యశాలి యెవఁడు?

అమ్మహామహోపాధ్యాయు నంతవాని
నాశుకవితలో నలరించి యాశుకవి శి
ఖామణి యటన్న బిరుదంబుఁగాంచినట్టి
సుబ్బరాట్కవీ! కీర్తి శేషుండవైతె?

అప్పకవి కున్న భావము
తప్పని చెప్పుటకునాశుధార తలఁచియే
కొప్పరపుంగవియై తా
నప్పనిఁ దీర్చికొనిపోయె నాంధ్రులు వగవన్