పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

330


6. మద్రాసులో మఱొకసభలో 'విజయఘంటికా' బిరుదమును, 7. గుంటూరులో మహాసభాజనులచే 'కుండినకవిహంస' బిరుదమును, 8. అందే సోమసుందరేశ్వరాలయ సభలో 'కవి రత్న' బిరుదమును, 9. బాపట్లలో మహాసభాజనులచే “అవధాని పంచానన' బిరుదమును, 10. మార్టేరులో మహాసభాజనులచే "కథా శుకవీశ్వర' బిరుదమును, 11. ప్రకృతము మాచే మహాసభలో “ఆశుకవి శిఖామణి" బిరుదమును బొందిరి.వీరింత కాలమును, ఆవధానాశుకవిత్వ సభలఁ గడపి యిప్పుడిపుడే గ్రంధరచనకారంభించిరి. కాని యింతకుమున్ను కొన్ని శతకములను దత్తుల్యములగు కొన్ని చిన్ని పొత్తములను రచియించియున్నారు. వీరు ఆశువున నానావిధ వృత్తములతో నేట్టికథనైనఁ బ్రబంధశైలిగ గంటకు 500 పద్యములు రచియించు సామర్థ్యముగలవారు, వీరొకపర్యాయము పన్నిదమునకై మార్టేరు సభలో గంటకు 720 చొప్పున యొక అరగంటకాలము మనుచరిత్ర యాశువుగ రచించిరఁట. వీరిపై నితరులగు మహాకవులు రచించిన ప్రశంసా పద్యములొక సహస్రము కెక్కువగానుండును. వీరింతవఱకు రచియించిన పద్యములన్నియు, వ్రాసియుంచినచో సుమారు మూఁడు లక్షల కెచ్చుగలవని సహృదయుల యభిప్రాయము. వీరిరువురును సోదరులు. వీరికింక యిరువురు సోదరులు కలరు. అందుఁ బ్రధములు, అష్టావధానమునఁ గృతకృత్యులై శతావధానమునకుఁ బ్రయత్నించుచున్నారు. గంటకు 200 పద్యము లాశువుగఁ జెప్పఁగలరు. వీరిపద్యము లీ గ్రంధమందు మఱియొకచోఁ గాన్పించును. వీరి పిన్న తమ్ములును గవిత్వము చెప్పఁగలరఁట. వీరి గృహమును జూచిన యొక కవి “కవితపుట్టిల్లు సోదర కపులయిల్లు" అని చెప్పిన గీతపద్య పాదమునుబట్టియే సర్వమును గ్రహింపఁదగియున్నది. జగద్విశ్రాంత కీర్తులగు వీరి విషయమింతకన్న వ్రాయుట పునరుక్తి,