పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

328

బాదుకొనుం దలంపఁగ వివాదపడందగు హేతు వింతయున్
లేదు కదా? వివాదకథ లీనము సేసి సుఖింపుఁడేకమై

ఎల్ల బ్రాహ్మణులును నేకమై యుండంగ
యత్నమాచరించు టర్హమగును
వేరువేరు శాఖలేరి యెక్కువ సేయఁ
బాడిగాదు సౌఖ్య పధము గాదు

వర పరవస్తురంగ కవివర్యుఁడు పండిత వేంకటార్యుఁడుం
దిరుపతి వేంకటేశులను ధీరతఁ బూని శతావధానముల్
జరిపెడు నాఁడు డీకొనఁ దలంపరు, వీరలపైకి శిష్యులం
బురికొలుపం దలంప రిటు బుద్దులు లేవొకొ వైష్ణవాళికిన్

పండితులం గవీంద్రుల నవారణఁ జేరిచి యైకమత్యమం
దుండఁగజేసి దేశము సముద్ధరణం బొనరించు వేడ్కతో
బెండిలియన్మిషంబునను బిల్చితి, వారపుడేట నేట ని
ట్లుండిన బాగటన్న నపుడొప్పితి నాగతిఁ గూర్పు సేయఁగన్

మంతన మొప్ప భాష నభిమానము గల్గినవారు దీనికిన్
నంతసమందిరేనియును సాగఁగఁ జేసెడు నట్టి భారమున్
గొంతవహించెదన్ మొదటి కూరుపు నెల్లరు నెంచి నెఫ్డు గా
వింత మటన్న నప్పటికిఁ వేడుక సిద్ధముగాఁగ నుండెదన్

పరిణయమందుఁ గూడుకొని పల్కిన పండిత వాక్య మేను ని
బ్బరముగ నామనంబున నుపశ్రుతిగాఁ దలపోసి యెల్లవ
త్సరముల నీ సమాగమము సల్పఁగ నెంచియె వ్రాసి యుంటి ని
వ్వరును మీఁదియంశము లవారిత కౌతుకవృత్తి మీఱఁగన్

రాజా మంత్రి ప్రెగడ భుజంగరావు