పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
321

     సరసుఁడెయైనఁ బండితులసన్నిధిఁ బిమ్మటనైన నేర్చికా
     వరముననొప్పు తప్పనుచుఁ బల్కితిఁ దప్పని నేనుజెప్పుటే
     మఱిమఱిగొప్పతప్పని' క్షమాపణఁ గోరుటమేలు, దానిచేఁ
     బరువునుబోదు; కాదనినఁ బండితగోష్ఠిని నిల్పుకోదగున్

29. సరసముగా సభాస్థలిని జాటుము నీదగు ప్రజ్ఞలన్నిటిన్
     విరసములేటికిన్! గపటవేషముఁ దాల్పఁగఁ జక్రవర్తివే!
     యరినెదిరింప వాదవిషయంబదిపోనిడి ప్రక్కత్రోవలన్
     సరభసవృత్తిగంతులిడసాగెదు దొంగనుబట్టలేరొకో!

30. నిరతము పచ్చిదొంగయయి నీచపుఁ ద్రోవలఁబోవువాడె వె
     ల్తురుఁగని సైపలేఁడెచటఁ దోరపుఁ జీఁకటియుండునోయటం
     చరయుచునుండు, రంధ్రములనంతటఁ జూడఁగఁగోరు, నోటినిన్
     దెఱచిన బూతులే దుముకు, తెల్పుసువాక్కుల బూతులంచొగిన్

31. "సురసనగేంద్రమయ్యది విశుద్ధసుధారసపూర్ణముల్ దొనల్
     సరసు లగాధముల్ గలవుచాల, తలంబటఁగానలేక బా
     పురె! నుమనః ప్రకాండములు మున్గుచుఁ దేలుచునుండు, నింకఁగిం
     పురుషులఁబట్ట నేర్చుపదముల్‌గలవౌర! మహాచితస్థితిన్

32. ఉరుమహిమాస్పదంబులు మహోన్నతముల్ కృతిరాజము ల్శతా
     భరణములన్ రచించియలపద్మజుదేవి నలంకరించినా
     డరిదిగఁ బొత్తమొండు సగమైన రచింపఁగలేక మన, డం
     తర మెఱుఁగంగలేవు బుధనాధుడవో! కవినేతవో! బలా!

33. మొరటునకబ్బఁగా మొగలిపూవు తదీయసుగంధధోరణుల్
     సరసమతింగ్రహించునె! వెసన్ వెలిఁబుచ్చు స్వకీయతుచ్ఛతన్
     విరివిగఁజాటుచాటునను బ్రేలెదు బూతులొ పచ్చిబూతులొ,
     తెరవిడి రమ్ము రమ్మిపుడె తెల్పెద బూతులుగావు నీతులే!