పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
319

     బరమపురాణముల్ బలెను బాడుచునుండెడి కొన్నిపొత్తముల్
     కరకరగీసి బాపురె! చకాపికి కక్పికి గ్రంధకర్త నం
     చురవడిఁ బాటపాడిన నహో! యభిమానులు వంతపాడినం
     గురుతరకీర్తి యబ్బుననుకొంటివె! కంటివె! పండితబ్రువా!

22. గిరపతిగింకటంబులను గీటడగింపఁగ గిత్తి గీన్కితో
     గిరపతిగింకటేశ్వరుల గిండకు గీటుగగీరి గిక్కడం
     గిరగిరగింతగీధలను గీరతముం గిలె గీడిగీడియా
     గిరియును గియ్యముంగెదరి గీవ్యమటంచునుగీసి యద్దియే
     వరకృతియంచుఁ బొంగుచును "వంచకమొక్కటి కాకి! కాకి! నీ
     స్వరము మనోహరంబుసుమి! పాడుమటన్నను నుబ్బి నోటిలో
     నెరపడిపోవుటంగనక యెంతయుగూసెడిలాగు” మీకృతుల్
     సరసములౌర! యేది యొకసారిపఠింపుఁడు పద్యమొండనం
     బురబురఁబొంగి యర్చకులముం దభిమానులముందుదేహముల్
     మఱచి సుధీసభాంతరములన్ మఱివీథులలోన మాటికా
     వరకృతిలోని పద్దెములె పాడుచు బల్ తయితక్కతందనాల్
     బఱపినయంతమాత్రమునఁ బండితుఁడౌనొకొ పండితబ్రువా!

23. కరటబుధప్రతీప మదగర్వహరుండగు నొక్కరాముఁడే
     పరుఁడనియెంచనేల? తలపన్ విబుధేంద్రుఁడు శ్రీనివాసుఁడుం
     సురనుతిపాత్రవాగ్రమణ సూర్యపదాన్వయ సత్యవాదులుం
     గరమశుభం బనర్ధకము కయ్యముమానుమటంచు నీతినిం
     గఱపఁగఁబూనువార లతికంటకులంచుఁ దలంచి రావణా
     సురుఁడెది మూటగట్టుకొనె! చూడఁగఁజాలవు దుర్జనుల్ రమిం
     తురు కలహోద్యమంబు సుజనుల్ నిరతంబును సంధిమార్గమే
     యరసెద'రన్న న్యాయమహహా! తెలిసెం భవదీయపాండితీ
     భరమిదియంచు, నీకెతగుఁ బండితనామము పండితబ్రువా!