పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

318

19. అరసితినీగతింబిడుగు వౌదుసుమీ సొరకోతలందు, బా
     గుర! యిది దూరమేగి తొడఁగొట్టెదు, పాండితిగల్గినన్ సభాం
     తరమునఁ బండితేంద్రులువినన్ భవదీయకళాతిశక్తి, వ్యా
     కరణపుఁదెల్విఁ జూపుమనఁగా జెవిదూరదదేమొ! వల్లభుల్
     విరిసినయట్టి కాంతలబలెం దల సూపఁడు ధైర్యమూని, యె
     వ్వరిక యపండితుండొకొ ప్రపంచమెఱుంగదె! పండితబ్రువా!

20. భరమనియెంచఁబోక పయిబట్టయు వచ్చెడిలాగు వెంబడిం
     బరువిడుచున్ వధానమునఁ బాతికవంతునె రెండునాల్లకుం
     బెరుగఁగఁ జేసి గోడపయి పిల్లివిధంబుననుండి సాయముం
     దఱిగనిపెట్టిచేయుచుఁ బదంపడి పృచ్ఛకులిచ్చు ప్రశ్నలం
     దఱిముఱిసాధ్వసాధువిషయంబులు చర్చకువచ్చినప్పుడం
     దఱికి స్వపాండితీస్థితి కనంబడకుండ, వధానికప్పుడే
     పరిభవమబ్బకుండ, బలె! పామదిచావకయుండఁ గఱ్ఱయున్
     విఱుగకయుండఁజెప్పు మదినేరుపుఁజూపెడి మధ్యవర్తి యై
     తిరిగినవాని దౌఋణముఁ దీర్చుకొనంగ నతిత్వరన్ మహా
     దరమునుజూపుచున్ శతవధానము వారముమీద నొక్కటన్
     దఱలిచి నాల్గురెట్లుగఁ గృతజ్ఞతఁజూపి శతావధానులం
     చొరులను దువ్విపంపిన మహోన్నతిఁగాంతువె! పండితబ్రువా!

21. చెరుపది యేమగున్ నిజము జెప్పిన నిష్ఠుర మొక్కటేసుమీ!
     స్థిరతరకీర్తి పూరుషులు తిక్కన పెద్దన మూర్తిలాగునన్
     సురుచిరసత్ప్రబంధములు సొంపులుగుల్కఁగఁజేసి యుంటివో,
     యరయగ దేవభాష నొకటైననుఁ గావ్యమువ్రాసియుంటివో,
     హరిహరదైవభక్తి విషయంబగు పద్దెము నోటవచ్చెనో,
     మురియుటకేమి? జల్లుపదముల్గల పూర్తికిరాని పొత్తమున్
     సరసములంచు మెచ్చుచును జాకలి మంగలి వేశ్యజాతులుం