పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
317

16. తిరుపతి పైది కొప్పరము - దీనికిఁ గ్రిందుగ నుండు వేంకటే
     శ్వరుఁడు పరిస్ఫుటాంశమిది సత్యము సత్యము సత్యమంచుఁ జూ
     పఱులకుఁ దోపుచుండఁ దలపైఁ గల వస్తువుఁ జూడలేమి నా
     తిరుపతి, మూల కొండొక ప్రదేశము నందున డాగి వేంకటే
     శ్వరుఁడొక రిద్దరద్ది కనఁ జాలక యున్నను వీని సంగతిన్
     గరము యధార్ధమే తెలుపఁ గల్గి యటం గల పాటిబండలే
     పరి పరి కర్మ సాక్షులయి పల్కఁగ నీగతి దాటు టెట్టులో
     యెఱుఁగనటంచు వాదెఱచి యేడ్చిన లాభమె? పండితబ్రువా!

17. ఒరులగుణాతిరేకముఁగళోన్నతి సుప్రతిభావిశేషమున్
    సురుచిరవాగ్విలాసమునుజూచి సహింపఁగలేక వారినె
    ల్లరువినుతింపఁగాఁదనకు లాఘవ మయ్యెడి నంచు నీసుతోఁ
    గొఱకొఱమంచు, వాదమునకుంజనుదెమ్మన రాక యేదియో
    వెరవునుజూచుచున్ వికటవేషములెన్నియొ తాల్చి చాటునం
    బరబరకూసికొంచు నవమాన భయంబును బొందఁబోక, కొ
    క్కెరపనులాచరించి యపకీర్తికిజంకక సిగ్గులేక సుం
    దరమని పెద్దచిన్నయును దైవము నీతియువీడి దేనికిన్
    వెఱవనటం చిసీ! విడచివేసిన వానివిధంబుదోప నా
    సురపద యోగ్యలక్షణముజూపుట లాభమె! పండితబ్రువా!

18. తరమగునే సలక్షణవధానము సల్ప మృషావధానికిన్
    'బరమముదంబు మాకు నొకవందయిడంబది వే'లటంటమే
    మెఱుగమె? “యిప్పుడంతకును నిబ్బడిముబ్బడి నాల్గురెట్లుగా
    దిరువదిరెట్ల కిబ్బడిగ నిత్తుము వచ్చి శతావధానమున్
    నెఱపు"డటన్న మొద్దుబలె నిశ్చలవృత్తిని బూనియుంటి వె
    వ్వరికమృషావధానియొ ప్రపంచమెరుంగదె! పండితబ్రువా!