పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

312


పండిత బ్రువ లక్షణము

(రామేశ్వర కవి విరచితము - 1911)

(రామేశ్వరకవి అనునది ప్రచ్చన్ననామము. అసలు పేరు పాటిబండ సూర్యనారాయణరావు, వీరు గుంటూరులో గొప్పవకీలు)

1. నిరుపమ శేముషీకలిత నిర్మలచిత్తసరోజులార! యో
   సరసకవీంద్రులార! బుధసత్తములార! గుణాడ్యులార! స
   త్యరతిపరీతులార! యనృతాత్యసహిష్ణుశుభాత్ములార! మీ
   రరయుఁడునాదుపల్కులివియన్నియు నొప్పులెయై తనర్చెడిన్!

2. త్వరపడఁబోక మీరిపుడు వాస్తవముం గ్రహియింపఁ గోరుచోఁ
   బురములయందుఁ బల్లెలఁ బ్రపూర్ణవిచారణ సేయుఁడీ! నిజం
   బెఱుగుఁడి! పాండితీగరిమయెందును లేక యఖండకీర్తి భా
   సురతఁ జెలంగఁగోరుపురుషుండు వికారములెన్ని సేసినన్
   ధరఁబరిహాసపాత్రుఁడగుఁ దధ్యముసత్యమువాస్తవంబు, ము
   మ్మఱుబరికించిచూడ ననుమానము లేశములేదు దీనికిన్

3. ఖరమది సింహచర్మమును గాయమునిండను గప్పికొంచుఁదా
   దిరిగిన నెంతదాక జగతిం బ్రమియింపఁగ జేయఁగల్గుఁ దొం
   దరగ నిజస్వభావముఁ గనంబడఁ జేయదె? సత్యసింహముల్
   పొరయనిచోట్ల “నేమృగవిభుండసుమీ" యనుచుం బ్రతాపముం
   బిరబిరఁదీయుచుం దనసమీపము, జేరకయుండ నెద్దియో
   వెరవునుజూచుచుం “దమరు వీరులు సద్గుణశాలు” లంచు ను
   త్తరములఁబంపుచుం గడుహితంబుగ నెట్టులొపుచ్చుఁగాల; మ
   బ్బరమదియేమి! తన్గుఱుతువట్టెడువారలు లేనినాడు త
   త్తరపడకెట్టి వేసములఁ దాల్చినఁ బట్టెడువార లెవ్వరుం
   దురు? కలకాల మొక్కగతితోఁ జనుచుండెనె? యెప్పుడైన నే,
   నరయఁగ నెందునేని నిజమైనమృగేంద్రము రాకయుండునే!