పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
311

సోదరమిత్రులా? కపట సూక్తుల వారల నిందఁజేసి మీ
వాదమునున్మిముం బొగడువార లపాక్షికులా? యిదెట్టిదీ
సోదెలు నమ్మువారలును జూడఁగ నేఁడును గూడ నుండిరే?

గారడు లింద్రజాలములుగా నవధానము లాచరించు మీ
తీరులు సత్యలేఖలను దెల్పెను బత్రిక లట్టివాని మీ
రూరక తిట్టుచుంటి రొహొహో! నెయి మీగఁడలన్ హరింపఁగా
గోరెడి ఫిల్లిశాపములకుం దెగ గంటిమె యుట్ల చేరులన్!

అగ్రాహ్యానృత పద్యకంటక కుజౌఘాకీర్ణ గుంటూరి సీ
మ గ్రంథాటవి తావకీనము నసన్మార్గంబునున్ సర్వ మం
త్రగ్రీవాయుత సత్యదైవత లసన్నారాయణాస్త్రానలా
త్యుగ్రజ్వాలలు భస్మసాత్కృతుని జేయున్ మానుఁడీ దంభముల్

దాంభిక గర్వభంజనులు,

గురువిశ్వనాథకవులు

(గురు విశ్వనాథకవులు అనగా శ్రీ మిన్నికంటి గురునాధశర్మగారు, శ్రీ పోతరాజు విశ్వనాథ కవిగారు)