పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

310

ఆలోచించియు వ్రాసినట్టిదగు పద్యంబే రసాభాసమై
బాలాలాప సమానమై గణయతిప్రాసాది సంత్యక్తమై
తాలుం బాతరఁ బోలియుండఁ దమ రేదారిన్ సుధాధారలన్
మేలంబాడు మహాశుపద్యకవులన్ మీఱంగ నాశింతురో

కాళీపాద పయోరుహార్చకుల వాక్కాంతా పుమాకారులన్
వ్యాలోలామృత వాగ్విలాసుల వధాన్యగ్రీవులన్ దుష్కవి
వ్యాలో వ్యూహ విహంగ పుంగవులఁ గొప్రంపుం గవీశార్కులన్
వాలింపన్ వశమే వధాన కవితా ప్రభ్రష్టులౌవారికిన్

శ్రీనివాసాచార్య సింహంబు గర్జింప
         నిభరూపమునఁ బరువెత్తునాఁడు
కాశినాథ బుధేంద్ర కాలాహి బుసవెట్ట
         మండూక రూపాన నుండునాఁడు
రామకృష్ణ కవీడ్తరక్షువీక్షింపంగ
         మృష భావమున లోగి మిడుకునాఁడు
శ్రీరామరాట్కవిశ్యేనంబు పొడసూప
         శశకిశోరక వృత్తిఁ జనిననాఁడు

నేరువని కొన్ని మాయల నేర్చి నేఁడు
దశగళాకృతిఁ దాల్చి పాతాళహోమ
మాచరించుచు నుంటి రయ్యదియు సోద
రకవి రాడ్రామలక్ష్మణ నికటచరకు
భృచ్చరులచేతఁ జెడు గీరతేశులార!

మీదగు కోపమంతయు సమిద్ద్యగఁ దెల్పుచు బుద్దిసెప్పఁవార్
వైదికులున్ నియోగులును వారలవారల కానివారలున్