పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మా యేల్చూరులో వైద్యులొక రొకనాఁడాకస్మికముగా బంగారు మురుగులతోఁ గన్పింప నివి యెక్కడివని యడిగితిమి. వారు శ్రీ వేంకటసుబ్బరాయ కవిగారికి జబ్బు చేయనయముచేసితిని. వారు నూతనవస్త్రములు నీ మురుగులు పెట్టిరనిరి. అచ్చటివారమాశ్చర్యపడితిమి. ఏలనో వీరికి జబ్బుచేయఁదదీయు లెవ్వరికిఁ దెలియనిచ్చెడివారు కారు. ఏలూరు సభకు ముందే 1913 ఈ జబ్బు చేసినది. సభానంతరముగూడ జబ్బుచేయ మద్రాసువెళ్ళి యెప్పటికోవచ్చిరి. ఏమి జబ్బో యెవ్వరికిఁ దెలియదు.

ఎవ్వరో యొకసారి హెచ్చరింపఁగా 'నాశువుగనే ప్రబంధములు నిర్మించు మేము; తలంచుకొన్న నెన్ని గ్రంధములు లిఖింపలేము? లిఖించుకాలము ముందు లేదా?' యనిరఁట.

1913 నాటికే వీరు కృష్ణకరుణా ప్రభావము దైవసంకల్పమను కావ్యములు కుశలవ నాటకము వ్రాసియుండిరి. అందలి పద్యములను వారేగాక యితరులు చదువఁగను వింటిని. భగవంతుఁడా! యిప్పుడాగ్రంథములేమైనవో? దురదృష్టవశమున వీరికవిత్వము పరులపాలైపోయినది. వీరు రచించిన కావ్యములు లేవుగాన వీరాంధ్ర కవుల చరిత్రలోని కెక్కఁదగరా? ఆంధ్రదేశము నాశుకవిత్వముచే నావేశ మెక్కించిన వీరికి కవుల చరిత్రలో స్థానములేదా? అనేక శతావధానము లాచరించి యనేక పండిత కవుల ప్రశంసలందుకొన్న వీరి కాంధ్రసారస్వత చరిత్రలో నొక్కపుట, యుండదా? ఉండనిచోనది భాషాదౌర్బల్యమేకాని నాకమందున్న వారికేమి? ఈ నియమమే యా కవిచరిత్రకారుఁడు పెట్టుకొన్నచో నతని చరిత్ర మసమగ్రముగాఁ దయారగును. ఎందఱో మహామహులు మహోపాధ్యాయులు గ్రంధములు వ్రాయని వారు వ్రాసి పోఁగొట్టుకొన్నవారు నతని చరిత్రను బహిష్కరింతురు. వేంకటసుబ్బరాయకవిగారు శక్తికిమించిన పనిచేసిరి. సభలలోనేగాక తదితర సమయములందును నాశువుచెప్పుచుండువారు. అమృతాంజనముడబ్బాను ప్రక్కనుంచుకొనియే వ్రాయుచుండెడివారు. అక్కతన మెదడుకరిగినది. దృష్టిమాంద్య మేర్పడినది. గ్రంథ

xxxvi