పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

298

భీష్ముని యుదయ ముత్రేక్షింపఁబడెను:-

ప్రాక్పయోరాశి సూర్యుని బడసినట్లు
క్షీర వారాశి యంబుజ వైరిఁ గన్న
యట్లు, జాహ్నవి గాంచె మహాత్ము భీష్ము
శంతనుండెంతయును మది సంతసింప.

పోతాప్రగడ వారియింటఁజెప్పిన యభిమన్యువధ, కంసవధల యందలి పద్యములు:- కుకవి నిరసన పూర్వకమగు నిష్టదేవతా ప్రార్ధనము:-

గురులఘువర్ణభేదమొక కొంచెమెఱుంగక తాఱుమాఱుగాఁ
దిరుగుచుఁ దన్నుఁబోలు నొక తిమ్మని గూడుచుఁ గొమ్మ లెక్కుచున్
చిఱచిఱలాడుచున్, విభుని చేపడి యందఱ వెక్కిరించు నా
తిరిపెపుఁ దిమ్మ పోతరము దీర్చి జయంబిడు మమ్మ శాంభవీ!

కంసవధయందుఁ బూతన సంహారమిట్లు తెలుపఁబడెను:-

పాలసుఁడైన కంసుఁడనుపన్ బెనుపండు వటంచుఁ బొంగుచున్
బాలిశయైన రక్కసి చివాలునఁ బాలివె పాలటంచు గో
పాలక బాలుఁజేఱెఁ దనపాలిఁకఁ దీఱె నటంచు బాలుఁడే
కాలుఁడటంచెఱుంగమిని గాలముదానికి దాపురించుటన్.

వలచు వారల మమ్ము వదరింపకుర యను
          పడఁతుల కోపాలు బాపుమేటి
దిక్కు మాకిక నీవె దీనపోషక యను
          భక్తుల పాపాలు బాపు మేటి
మదమెత్తి యెదిరించి కదనంబు సల్పెడి
          పగతుర రూపాలఁ బాపుమేటి