పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
297

విషమపుఁ దాళ వృంతమున బెంపగు గాలిని దీపమాఱె, నా
విషమ శర ప్రయుక్తమగు భీమ మహాశుగ శక్తి నమ్మహా
భిషుని హృదంతర స్థితిని వెల్లెడి జ్ఞానపు దీప మాఱెఁగా
విషయ సుఖంబులం దెగడు విజ్ఞులిసీయని యేవగింపఁగన్.

ఎవ్వరేని తన్నపహసింతురేమోయని శంకించు మహాభిషుఁడు మనసును దృఢము చేసికొనిన విధమెంత స్వాభావికముగ వర్ణించిరోచూడుఁడు.

కించు దనంబు దోఁప నను గేరి తిరస్కృతి సేయువారు యో
జించు కొనంగలేరొ తమ చెయ్వులు! దిక్పతులంచు మౌనులం
చెంచెద నొక్కొ యిట్టి తఱి యీ చనుదెంచిన వారికిట్లె నే
మంచము లెల్లఁగంతలను మాట యెఱుంగఁగఁ జేయఁ జాలనే

గంగ శంతనుని దృష్టిపథంబునఁపడునప్పటికి ధరించి యున్నసుందరాకృతియిట్లు వర్ణింపఁబడెను.

పున్నమి జాబిల్లిఁ బోలు నెమ్మొగమును,
          కలువ ఱేకుల మించు కన్నుఁ గవయు,
నీలంపు సరులనఁజాలు ముంగురులును,
          దిమిరంపు రాశినిఁ దేగడు కొప్పు
తళుకుటద్దములఁ గాల్దన్ను నున్జెక్కులు,
           కలదు లేదను భ్రాంతిఁ గొలుపు కొను,
ఇసుక తిన్నెల గోట నెగమీటు పిరుదులు,
          లే యనంటుల గేలిసేయు తొడలు

విలసిలఁగ నొక్క వెలఁదియై విమలరత్న
ఘటిత కాంచన భూషణ కలిత యగుచు
మదన మంత్రాధిదేవత మాడ్కిఁ దనరు
జాహ్నవిని గాంచి మోహించే శంతనుండు.