పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
295

గంగకును బ్రహ్మకును గల బంధుత్వమును, అమె యతనిఁజూడఁగోరుటయు నిట్లు తెలుపఁబడెను.

హరి పద నలమునఁ దా, నా
హరి నాభీ నలినమందు నజుఁడొదవుట సో
దర భావమూని యొకతఱి
సురనది యయ్యజునిఁజేరి చూడఁదలంచెన్.

గంగ శరీరధారిణియైన విధమిట్లు ప్రశంసింపఁబడెను:-

ఘన శిరోజౌఘమో కాక శైవాలమో
         యను సందియంబింత యమర కుండ
నయనంబులో కాక నలిన పత్రంబులో
          యను సందియం బింత యలమ కుండఁ
దళుకుఁజూపులొ కాక బెళుకు బెడిస మీలొ
          యను సందియం బింత తనర కుండ
గరువంపు పిరుదులో కాక సైకతములో
          యను సందియంబింత మొనయ కుండ

వళులొ కాక బెడంగైన యలలొ యనెడి
నట్టి సందియ మింతయు నలర కుండ
గంగ నైజాంగ సంపదల్ రంగు మీఱ
నొక్క శృంగారవతి యయి యొప్పుఁ గాంచె.

తోడి నదులు స్త్రీ రూపములను దాల్చి గంగాదేవిని వెంబడించుట:-

అవ్వార్త విని యొక్క జవ్వనియై వచ్చి
          యమునా మహానది యాశ్రయించె
అప్పల్కు విని యొక్క కప్పుర గంధియై
          వచ్చి కృష్ణానది మెచ్చుఁ జూపె