పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జమీందారుగారును నొకసభ చేయించిరి. 18-6-1912తేదీ సభలో శ్రీఏలేశ్వరపు సుబ్రహ్మణ్యశాస్త్రిగారు “చెలఁగగంజామువారింట సీతపెండ్లి, లీల భీష్మజననము కాలేజిలోన, ఠీవిమీఱ బ్రహ్మానందరావుగారి భవనమున నభిమన్య కంసవధలనెడి. కధలఁజెప్పిరి సోదరకవులు బళిరె" అని ప్రశంసించిరి.

పిదప పంగిడిగూడెము శతావధానములే యచ్చైనవి నాకంటఁబడినవి. 1920 రౌద్రిసంవత్సరమున 61మందికిఁ బంగిడిగూడెమున నవధానమొనర్చిరి. 1921 దుర్మతిసంవత్సరమున 100 మందికి సంపూర్ణశతావధానమొనర్చిరి. ఈ సంపూర్ణ శతావధానాంతమున శ్రీ పి.వేంకటకృష్ణకవి “మునుసంపూర్ణ శతావధానము..” హైదరాబాదులో వీరుచేసిరని చెప్పెను. (92 పేజీ చూడుడు) ఆయవధాన మచ్చుకాలేదు.

శతావధానులమని చెప్పుకొనువారు 30-40 మందికేగాని నూర్గురు పృచ్ఛకులకుంజెప్పి యవి ధారణపట్టి యవధానాంతమునఁజదివిన వారెవ్వరులేరు. వీరు మాత్రము చేసిరా? యని భావికాలమందెవ్వరేని శంకింపకుండ దైవికముగా నా పృచ్ఛకుల నామములును నాయాపద్యములంబడినవి. 40,50.82,87,89,91 మున్నగు పద్యములంజూడుఁడు. ఆ సభాంతమందొకరు “పూర్ణశతావధానమిది పూర్ణసమర్ధతమీరొనర్చుటన్ బూర్ణముదంబుమాకొదవె” అని ప్రశంసించిరి. ఆ సభలోవీరి ధారణను బరీక్షించుటకుఁ గాఁబోలు గీతపాదమున సమస్యనిచ్చి సీసములోఁ జెప్పుమనిరి. 49, 90 పద్యములుచూడుఁడు. అవధానులు సాధారణముగాఁగంద గీతములతోఁ దప్పించుకొనిపోవుదురు. పెద్దపద్యములు ధారణకు నిలుచుటకష్టము. ఇందు 17 సీసపద్యములుగలవు. ఇఁక స్రగ్ధరలు, మహాస్రగ్ధరలు లయగ్రాహులుంగలవు. స్రగ్విణి, సుగంధి, భుజంగ ప్రయాతాది వివిధవృత్తములు గలవు. ఇది శతావధానముగాదు. ఒక ప్రబంధము. దానికిందగినట్లు దైవికముగా నవధానాంతమున నంత్యప్రాసతో మాలినీ వృత్తము 'విపదగ పవిభావా వేణుగోపాల

xxxiv