పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

274


కాకినాడ సభలు

శ్రీ చేగంటి బాపిరాజుగారు

శ్రీ మదయోధ్యా నగరీ
ధాముఁడు సోదర యుతుండు ధాత్రీతనయా
కామనుఁ డనిలజనుతుఁడు య
శోమహితుఁడు బ్రోచుఁగాత సోదరకవులన్

సుకవితాభిమానులారా! సూనృతప్రియులారా!

సకలదిగంత విశ్రాంతకీర్తులును బాలసరస్వత్యాది బిరుద విరాజితులును నైన శ్రీమత్కొప్పరపు సోదరకవీంద్రుల చరిత్రంబు నెఱుంగనివారును, వానను దడవనివారును, సూర్యకిరణ ప్రసారంబు సోఁకనివారును, లేరని నాకుఁదెలిసియు వారు నూతనముగా నీ కాకినాడ పురంబునకుఁ దెనాలిపురమున న్యాయవాదులు, రసజ్ఞులునునగు శ్రీమదజ్జడపు భీమశంకరరావు పంతులుగారిచే నాహ్వానింపంబడి 21-5-1912 తేదీయందు శ్రీగంజాం వేంకటరత్నము పంతులుగారి ద్వితీయ పుత్రికా కళ్యాణ మహోత్సవ సమయంబునకు వచ్చి యాపుర వాసుల నాశుకవితామృత ప్రవాహంబున నోలలాడించి యచ్చట ననేకవిధ బహుమానంబుల నందిరి.

ఆంధ్రభాషా విశేషంబున నీ యాంధ్రదేశ యోషామణికి సువర్ణమయ మహాభూషణంబనందగిన నీ కాకినాడ పురంబున నిట్టి యనుపమానమగు తమ