పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
273

వాణీసతినిభక్తి వహియింతురని వీరు
          కవిహంసచిహ్నసంకలితులైరి
సరసుల సన్నిధిఁ జరియింతురని వీరు
          కవిహంసచిహ్నసంకలితులైరి

యనుచు మీనూత్న నామంబు లనుదినంబు
సార్థకంబని తలపోసి సభ్యులకిటఁ
చెప్పి వేడుక పొడమినఁ జిన్నతనపు
సాహసంబొప్పఁ జెప్పితి శంకవీడి

చేతనైనట్లు సల్పితి గీతములను
సీసమిచ్చితి బంగారు చేతలేదు
వెండియునుగొద్ది మాయింట విబుధులార!
రత్నకవి యిచ్చువానిని రహిచెలంగ

మఱియు నుత్పలచంపక మాలికలను
శక్తికొలదిని సమకూర్చి భక్తిదోప
నిడితి బుధులార! గైకొనుండింపుమీర
నేను మీకిచ్చు బహుమతు లివియెసుండి.

సూనృత ప్రియులైన విశుద్ధమతుల కఖిలవిద్యాడ్యులైన మహాత్ములకును
నిష్కళంక చరిత్రులౌ నిపుణులకును
మోదమిడుఁగాత మీ చిన్న పొత్తమెపుడు

గుంటూరు

1911

ఇట్లు,

సి.యల్.నారాయణ ప్రసాద్, బి.ఏ.

(సంకలన కర్త)