పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

272

మాయమ్మ సత్కటాక్షము
పాయక మీకందఁజేయుఁ బరమాత్ము దయన్

ఆరయ మీదుకంఠమున నక్కజమయ్యెడి పుష్పహారముల్
సూరిజనంబులీయ నవి సొచ్చెనామీగళమందుఁ జూడలే
వో రసవంతమై వెలయు నుత్పల చంపక మాలికావళుల్
సారముచే మనోజ్ఞగతిఁ జల్లుచు జారుసుగంధ మాసఁగాన్

ఆశుగములౌచు మీనుడు
లాశలఁ బ్రసరించి మించి యలరుట నిజమౌ
నాశక్తి మీకెయున్నదె
పో శంకలిఁకేల మీరు భూ గీర్వాణుల్

వెయ్యేడుల్ దలక్రిందులై తపములన్ బెంపొందం గావించినన్
జయ్యంబేరికి నాదువేగమని నీ స్వాంతంబునందెన్ను దే
మయ్యా మారుత! వీరియక్షర జయంబందంగ లేవింకఁ బో
వయ్యా పుష్పసుగంధచోర! నిను చేనందంగనున్నారు వీ
రయ్యో దేహమునెందొ దాచుకొనవయ్యా యండ్రు గాడ్పున్ జనుల్

ఆయక్షర వస్తువెటో
స్వాయత్తమునయ్యెఁ బరమ హంసలు మీకో
హోయంచు నరులుపొగడ న
మేయంబై మీదుశక్తి మేదిని వెలయున్

కవిరాజులై వీరు భువిని భాసిలిరని
          కవిహంసచిహ్నసంకలితులైరి
భువనంబులందెల్లఁ బొల్పందిరని వీరు
          కవిహంసచిహ్నసంకలితులైరి