పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

242


పండిత కవుల ప్రశంసలు

లేక

కొప్పరపు కవుల యశోడిండిమము

మద్రాసు సభలు

శ్రీ చిరుమామిళ్ళ లక్ష్మీనారాయణ ప్రసాదు, బి.ఏ.గారు

ఉపోద్ఘాతము

సోదరులారా! విద్యాభిమానులారా!

బ్రహ్మశ్రీ కొప్పరపు సోదర కవీశ్వరులిదివఱకు శతావధానాష్టావధానము లనేకములుగా జరిగించియుండిరి. కాని, నేనెఱింగినవి మాత్రము శశిరేఖాది పత్రికల నుండి కొన్నిటి నెత్తి వ్రాసితిని.


శ్రీ కొప్పరపు కవులని కీర్తినొందిన బ్రహ్మశ్రీ కొప్పరపు వేంకటసుబ్బరాయ వేంకటరమణాభిధానులయిన కవిశిఖామణులు, సోదరులు. వీరు నివసించు గ్రామము కొప్పరము. తాలూకా నరసరావుపేట. జిల్లా గుంటూరు.

వీరు పదిరెండేడుల వయస్సులో నుండినపుడే కవిత్వమల్లువారు. తమ తండ్రిగారయిన వేంకట రాయలగారియొద్దను, ఏర్చూరి గ్రామనివాసులయిన బ్రహ్మశ్రీ పోతరాజు రామకవి గారియొద్దను, నర్సారావుపేట నివాసులగు బ్రహ్మశ్రీ రామడుగు రామకృష్ణశాస్త్రిగారి యొద్దను విద్యనభ్యసించి క్రమక్రమముగాఁ గవితాశక్తితో నవధానసామర్ధ్యమును వృద్ధిపరచికొని పట్టణములందును, పల్లెల యందును రసికులచే మెప్పుఁజెంది అష్టావధాన శతావధాన సభ లిదివఱకెన్నియో జరిగించియున్నారు.