పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

సత్కవిమనఃప్రపూర్తిని సల్పుచున్న
నినుఁబొగడఁజెల్లు నాగేంద్ర! నృపకులేంద్ర!

దాతల్ గల్గుదు రందునందునెఱదాతల్‌కొందఱేయుందురా
దాతృత్వాంబుధులన్ సమర్హకృతివేత్తల్ స్వల్పసంఖ్యాకులా
యీతీరుల్‌గణియింప శ్రేష్ఠపదమే యీవందితౌ, సత్కవి
వ్రాతఖ్యాత సుపద్యగద్యనిచయభ్రాజద్యశోవైభవా.

అంచితాన్యోన్య సమావేశమూనక
         దాంపత్యసుఖమొందఁ దలఁచుటెట్లు
గందపుంజెక్కఁ జక్కఁగ నఱగింపక
         చందనానందంబుఁ జెందుటెట్లు
తైలవర్త్యగ్ని సంధానంబుసల్పక
         తిమిరంబువో వెల్గుఁ దెచ్చుటట్లు
సామజాశ్వాదుల సమకూర్చికొనక త
         దారోహణోన్నతి నందుటెట్లు

వ్యజనచామరముఖ సంగ్రహణము లేక
స్వేదబాధాపహసుఖంబుఁ జెందుటెట్టు
లనుచు నర్హక్రియల ధన వ్యయమొనర్చి
యశము నార్జించితీవు నాగావనీశ !

వైవాహికోత్సవా వసరంబునందుఁ బి
         ల్పించి హెచ్చుగ గౌరవించుటయును
పట్టాభిషేకవైభవమందు నాఁడర్హ
         విధుల సత్కృతులఁ గావించుటయును
శ్రీవేణుగోపాల దేవోత్సవములయం
         దిరునూట పదియారు లిచ్చుటయును