పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేంకట జానకీరామ శర్మగారు. శర్మగారికి కొప్పరపు సోదర కవులపై గల అభిమానము వర్ణనాతీతము. శర్మగారు పునర్ముద్రణముచేయనిచో లక్ష్మీనారాయణ ప్రసాదుగారి, బాపిరాజుగారి సంకలనములుకూడ కాలగర్భములో కలసి పోయెడివి.

కొప్పరపు సోదర కవుల ప్రతిభను తరువాతి తరముల వారికి అందజేసిన మహానుభావులు ఈ ముగ్గురు.

జానకీరామశర్మగారు ప్రచురించిన గ్రంధములు కూడ వృద్ధుల చెంత శిధిల స్థితిలో నున్నవి.

జానకీరామశర్మగారు ప్రచురించిన కొప్పరపు సోదర కవులకు సంబంధించిన సాహిత్యమును, నేను సేకరించిన మహాకవి కాళ్లకూరు నారాయణ రావు గారు వ్రాసి మనోరంజనీ పత్రికలో ప్రచురించిన “కొప్పరపు సోదర కవులు-ఆశుకవిత” అను వ్యాసమును, మరికొన్ని ఆధారములను, అన్నింటిని చేర్చి ఒక ప్రణాళిక వేసికొని ఈ గ్రంథమును నేను రూపొందించుట జరిగినది.

ఈ కార్యక్రమము సంపూర్ణము చేసి అచ్చునకు ప్రతి సిద్ధము చేసిన సంస్కార ఫలముగా, నేను “కోప్పరపు సోదర కవులు” అనునొక 150 పుటల సమీక్షా గ్రంధమును వ్రాసి ప్రచురించినాను (ఫిబ్రవరి 2003).

ఎందరో పెద్దలుండగా ఈ కార్యక్రమమును భగవంతుడు నాచేత చేయించుట నా అదృష్టము, నా పూర్వజన్మ సుకృతము.

గుంటూరు,

నవంబర్ - 2003.

బుధజన విధేయుడు,

గుండవరపు లక్ష్మీనారాయణ

XXI