పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

139


శ్రీవారి ప్రథమ సందర్శనము మొదలు శ్రీవారికిని మాకును గలుగుచు వచ్చిన సమయానుగుణ ప్రసంగోచితములుగను, ఇతర విషయములుగను శ్రీవారికి సంబంధించినవఱకు మాచే రచింపఁబడిన పద్యములు రాజాలోకమనుపేరుగల వివిధప్రసంగపద్యావళియందుఁజేర్పఁబడినవి. ఈ రెండు సంవత్సరముల సభా సమయములకుం జనుదెంచి అవధానములఁ దిలకించి వ్రాసిన కవుల ప్రశంసాపద్యములలో మాకు లభించినవానిలోఁ గొన్నిటి నిందుఁ బ్రచురించినారము.

ప్రథమ సంవత్సరావధానములోని దేవీస్తవమగు "నీలాంబుజారామకేళీ మరాళమై” యను సీసము శ్రీమద్దుర్మతి సంవత్సరపు, ఉగాది సంచికలో “సంవత్సర ప్రశంస”లో మొదటఁ బ్రకటింపఁబడియున్నది. పద్యముల సందర్భము లందు వివరింపఁబడి యుండుటచేఁ బునరుక్తమగునని యెంచి ప్రత్యేకముగా విషయ సూచిక ముద్రింపలేదు. శ్రీవారికిఁగల ఆర్యమత సంప్రదాయసిద్ధమగు దేవ బ్రాహ్మణ భక్తియు విద్యాదరము నిందుఁ బ్రస్ఫుటముగాఁ గన్పించు చున్నది. ఇట్టి భగవచ్చేవాపరులగు దంపతులకు దైవ మాయురారోగ్యైశ్వర్యాభీష్టఫలసిద్దు లొసంగుఁ గాత!

ముద్రణ ప్రమాద దోషములను గుణజ్ఞులు పాటింపకుందురు గాక.

ఇట్లు,

కొప్పరపు సోదరకవులు

శతావధానులు

1922 సంవత్సరము