పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

137


పంగిడిగూడెము శతావధానములు

అవతారిక

రసికమహాశయులారా!

ఈచిన్నిపుస్తకమునకుఁ గారణభూతులైనవారు, ఆంధ్రదేశంబునఁ బ్రసిద్ధి వహించిన, సంస్థానములలో నొకటియగు నుత్తర వల్లూరు సంస్థానాధీశ్వరులలో జ్యేష్ఠులును, సద్యశోగరిష్టులునునగు మహారాజ రాజశ్రీ శ్రీరాజా బొమ్మదేవర నాగన్న నాయఁడు బహద్దరు జమీందారువారు. వీరి పూర్వులు జగదాశ్చర్య కార్యకలాపము చేతను, ప్రభుజన ప్రీతికర వర్తనముచేతను జనోపద్రవకారి ఘోరమృగ నిర్మూలన కృత్యములచేతను, ప్రఖ్యాతివహించి దేశాధిపతులగు నాంధ్రాంగ్లమేచ్ఛ ప్రభువరేణ్యులచే వివిధవిధ స్వర్ణబిరుదాలంకార లాంఛన సత్కారములనేకముల గ్రహించి యుండిరి. పూర్వోదాహృతములగు విషయములచే వీరిదిశూర సంస్థానమని నిర్ధారితము కాఁబడినది. ప్రస్తుతప్రభువులకుఁ బితామహులును బితామహప్రజ్ఞా గణనీయులును స్థిరయశఃప్రియులును, విద్యానురక్తులును వితరణశీలురునునైన శ్రీ శ్రీ రాజా బొమ్మదేవర నాగన్న నాయఁడు బహద్దరు జమీందారువారు "యశ ఏవ జన్మఫలతాత్మవతామ్” అను నార్యోక్తిననుసరించి, శాశ్వత యశంబు సంగ్ర