పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
110

గుంటూరులో ననవసరముగా ననూయావిశేషముచేఁ దిరుపతి వేంకటకవులు తమ్మునిందించుటచే నీసోదరకవులు వారినిఁ గూర్చి కొన్ని ప్రతిజ్ఞా పద్యములఁజెప్పిరి. అందుకొన్నిటినిందుఁ దెలుపుచున్నారము,

ప్రతిజ్ఞా పద్యములు

బ్రహ్మశ్రీ తిరుపతి వేంకట కవీశ్వరులకు

తిరుపతి వేంకటేశ కవిధీరుల కియ్యదె విన్నపంబు కొ
ప్పరపు శతావధానులను వారలలో నొకరుండ నాత్మలో
నిరతము మీరు మున్నొసఁగు స్నేహము నిల్పఁగఁగోరువాఁడ మీ
పరువును మాపు మాటకు జవాబు నొసంగిన వాఁడ నమ్ముఁడీ.

చెన్న పురంబునందు మఱి చెప్పఁగ నొప్పెడి పట్టణంబులం
దెన్నఁడు మిమ్ము చూడకయె, యేము ప్రసంగ వశంబునన్ మిము
న్మన్నన చేసినామనెడి మాట నెఱింగియు, మమ్ముఁబూర్వమే
సన్నుతిఁజేసి నేఁటి సభ శాంతము వీడి వచించు టేమొకో.

మీరును మేమున్ మైత్రిన్
బేరుంగొనినార మనుచు విమతులు నడుమన్
జేరి కుయుక్తులు పన్నిన
యారీతి నెఱుంగ కట్టులాడందగునే

అన్యుని సహాయ మించుకయైన లేక
పద్య మవధానమందుఁ జెప్పంగలేని
మీ మహాధారణాశక్తి మీకే కాక
యెల్ల వారికి నీ సభ నెఱుక పడియె.

ఆశుకవిత్వంబు నల్లఁబూనెదరేని యద్దాని మించి చేయంగలేమొ
అష్టావధానంబు నాచరించెదరేని యద్దాని మించి చేయంగలేమొ